అక్షరటుడే, వెబ్‌డెస్క్: rrr travels bus | తూర్పు గోదావరి జిల్లా East Godavari district లో బుధవారం తెల్లవారుజామున పెద్ద ప్రమాదం తప్పింది. ఖమ్మం Khammam నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆర్ఆర్ఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైంది. కొవ్వూరు గ్రామన్ బ్రిడ్జి Kovvuru Graman Bridge సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోగా, బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు ప్రయాణంలో ఉండగానే సెల్ఫ్ మోటార్‌లో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడింది. దీంతో క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగుతున్న విషయాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు. ప్రయాణికులకు పరిస్థితిని వివరించి వేగంగా బస్సు నుంచి బయటకు దింపడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
rrr travels bus | పూర్తిగా దగ్ధం..
ఈ ఘటన సమయంలో బస్సులో మొత్తం ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. డ్రైవర్ Driver చాకచక్యంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, మంటలు తీవ్రంగా ఉండటంతో కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సు నుంచి భారీగా పొగలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కొంతసేపు భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమవడంతో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు అంచనా వేస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రమాదం జరిగిన అనంతరం ప్రయాణికులను Passengers ప్రత్యామ్నాయ బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్సులో జరిగిన షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో తీసుకున్న నిర్ణయం వల్ల ప్రాణనష్టం తప్పిందని అధికారులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.