ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mepma RP's | పెండింగ్​లో ఉన్న జీతాలు ఇప్పించాలని ఆర్పీల డిమాండ్​

    Mepma RP’s | పెండింగ్​లో ఉన్న జీతాలు ఇప్పించాలని ఆర్పీల డిమాండ్​

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Mepma RP’s | ఆర్నెళ్లుగా పెండింగ్​లో ఉన్న జీతాలను ఇప్పించాలని మెప్మా ఆర్పీలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్​ కలెక్టర్​ అంకిత్​కు అరుణోదయ రిసోర్స్​ పర్సన్స్​ సొసైటీ (Arunodaya Resource Persons Society) తరఫున వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా ఆర్పీల యూనియన్​ జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి స్వర్ణలత మాట్లాడుతూ.. జీవో 164 ఆధారంగా వీఎల్​ఆర్​ నుంచి ఆర్పీలకు జీతాలు ఇవ్వాలని ఉందని.. దీంతో తమకు జీతాలు అందడం ఆలస్యమవుతోందన్నారు. 2025 మార్చిలో సెర్ప్(SERP)​, మెప్మా వినీనమవుతోందని చెప్పారని.. కానీ ఇప్పటివరకు మున్సిపల్​ కార్పొరేషన్​ నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు.

    Mepma RP’s | సర్వేలు చేస్తే ప్రతిఫలం లేదు..

    ప్రభుత్వం సూచించిన ప్రతి సర్వేలో తాము పాల్గొని విజయవంతంగా పూర్తి చేశామని స్వర్ణలత పేర్కొన్నారు. కంటి వెలుగు(kanti velugu survey), ప్రజా పాలన (Praja palana survey), సమగ్ర కుటుంబ సర్వే (Samagra kutumba survey) లు ఇలా అన్ని సర్వేలను సమగ్రవంతంగా పూర్తి చేశామని.. కానీ ఇప్పటి వరకు రెమ్యూనరేషన్​ ఇవ్వలేదని వాపోయారు.

    ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు నెలనెలా క్రమం తప్పకుండా జీతాలు ఇవ్వాలని.. అలాగే సర్వేల రెమ్యూనరేషన్​ సైతం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. సొసైటీ జిల్లా కార్యదర్శి మంజుల, కోశాధికారి స్వప్న, జ్యోతి, సుమలత, విజయ, జయ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Stock Markets | చివరలో ప్రాఫిట్‌ బుకింగ్.. స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Markets | టారిఫ్‌ల విషయంలో అనిశ్చితి(Tariff uncertainty) కొనసాగుతుండడం, ఎఫ్‌ఐఐ(FII)లు వరుసగా పెట్టుబడులు...

    Telangana University | తెయూలో విద్యార్థుల ఆందోళన: హెల్త్​కేర్​ సెంటర్​లో ఔషధాలు ఉంచాలని డిమాండ్​

    అక్షరటుడే,డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హెల్త్​కేర్​ సెంటర్​ (Healthcare Center) ఎదుట సోమవారం విద్యార్థులు ఆందోళనకు...

    Heavy Rains | మాయదారి వాన.. వర్ష బీభత్సంపై కవి ఆవేదన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | కామారెడ్డి జిల్లాలో 15 రోజుల క్రితం వర్షం బీభత్సం సృష్టించిన...