ePaper
More
    Homeక్రీడలుRCB vs KKR | ఆర్సీబీ Vs కేకేఆర్ మ్యాచ్ క్యాన్సిల్.. మ‌నీ రిఫండ్

    RCB vs KKR | ఆర్సీబీ Vs కేకేఆర్ మ్యాచ్ క్యాన్సిల్.. మ‌నీ రిఫండ్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: RCB vs KKR | ఐపీఎల్ 2025 (IPL 2025) పునఃప్రారంభ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావ‌డంతో ఫ్యాన్స్ కాస్త అప్సెట్ అయ్యారు. రీషెడ్యూల్ ప్రకారం, బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో (bengaluru chinnaswamy stadium) శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (royal challengers bangalore), కోల్‌కతా నైట్ రైడర్స్ (kolkata knight riders) జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉండ‌గా, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ (meteorological department) ముందు నుంచి చెబుతూ వచ్చింది. ఆ అంచనాలను నిజం చేస్తూ వర్షం కూడా కురిసింది. వర్షం కారణంగా టాస్ ఆలస్యమైంది. ఓ దశలో వర్షం తగ్గినట్లే కనిపించడంతో మైదాన సిబ్బంది కవర్లు తొలగించేందుకు కూడా సిద్ధం అయ్యారు. కానీ ఆ త‌ర్వాత కురిసిన వ‌ర్షం ఎంత‌కు త‌గ్గేలేదు. దీంతో ప్లేయ‌ర్స్ అంద‌రూ డ్రెస్సింగ్ రూమ్‌కే (dressing room) ప‌రిమితం అయ్యారు.

    RCB vs KKR | మ‌నీ రిఫండ్..

    ఎడ‌తెరిపి లేని వ‌ర్షంతోపాటై ఔట్ ఫీల్డ్ (out field) చిత్త‌డిగా మార‌డంతో మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. మ్యాచ్​ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక ఈ మ్యాచ్ లో క‌చ్చితంగా నెగ్గాల‌ని భావించిన కేకేఆర్ (KKR).. మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో కేవ‌లం ఒక్క పాయింట్ మాత్ర‌మే సాధించింది. దీంతో 13 మ్యాచ్ ల నుంచి కేవ‌లం 12 పాయింట్లు సాధించిన కేకేఆర్.. మ‌రో మ్యాచ్ మిగిలి ఉన్న‌ప్ప‌టికీ నాకౌట్ చేరే అవ‌కాశం ద‌క్కించుకోలేక‌పోయింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా ల‌భించిన పాయింట్ తో ఆర్సీబీ (RCB) 17 పాయింట్ల‌తో టాప్ ప్లేస్ ను ద‌క్కిచుకుంది. కాక‌పోతే ఇంక ఆ జ‌ట్టు ప్లే ఆఫ్స్ (play offs) క‌న్‌ఫాం చేసుకోలేక‌పోయింది.

    2025 మే 17న జరగాల్సిన RCB మరియు KKR మధ్య జరగాల్సిన ఆట ప్రతికూల వాతావరణం కారణంగా రద్దు చేయబడినందున, టిక్కెట్ కొన్న వారంద‌రికి డ‌బ్బు వాప‌సు (money return) ఇవ్వ‌బ‌డును. డిజిటల్ టికెట్ హోల్డర్లకు వారి ఖాతాకు 10 పని దినాలలోపు వాపసు జారీ చేయబడుతుంది. మే 31 నాటికి మీకు వాపసు అందకపోతే, దయచేసి బుకింగ్ వివరాలతో refund@ticketgenie.in కు ఇమెయిల్ (e-mail) పంపండి. ఇక ఫిజిక‌ల్ టిక్కెట్ కొనుగోలు చేసిన వారు మీ టిక్కెట్ (ticket) ఎక్క‌డ తీసుకున్నారో అక్క‌డికి వెళ్లి మీ మ‌నీని తిరిగి పొంద‌వచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం rcbtickets@ticketgenie.in కు ఇమెయిల్ పంపండి.

    Latest articles

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుంది..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని..ఓటమి గెలుపుకు నాంది అని టీఎస్ ఎన్పీడీసీఎల్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం తెలంగాణ భవన్​లో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    More like this