HomeతెలంగాణNizamabad City | రౌడీషీటర్‌ గ్యాంగ్‌ సభ్యుడు ఇర్ఫాన్‌ అరెస్ట్‌

Nizamabad City | రౌడీషీటర్‌ గ్యాంగ్‌ సభ్యుడు ఇర్ఫాన్‌ అరెస్ట్‌

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: Nizamabad City | బర్సాత్‌ అమీర్‌ అనే రౌడీషీటర్‌ గ్యాంగ్‌ సభ్యుడైన ఇర్ఫాన్‌ను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఏసీపీ రాజా వెంకట్‌రెడ్డి (ACP Raja Venkat Reddy) తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని అసద్‌బాబా నగర్‌కు చెందిన ఇర్ఫాన్‌(23) కేటరింగ్‌ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బర్సాత్‌ అమీర్‌ అనే రౌడీషీటర్‌ గ్యాంగ్‌తో కలిసి ఈనెల7న బోధన్‌లో (Bodhan) ఓ ఆటోవాలాను కత్తులతో బెదిరించి నగదు లాక్కున్నారు.

అదేరోజు సాయంత్రం ఇర్ఫాన్‌ బైక్‌పై అసద్‌ బాబా నగర్‌ నుంచి ఆటోనగర్‌ (Auto Nagar) వైపు వెళ్తుండగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా వారిపై కత్తులతో దాడిచేసి పారిపోయాడు. బుధవారం నగరంలోని ఫ్రూట్‌ మార్కెట్‌లో ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకోగా, ఇర్ఫాన్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతని వద్ద నుంచి తల్వార్, రెండు కత్తులు, రెండు చేతిపంచులు, 50 గ్రా. గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెల్లడించారు. గ్యాంగ్‌ సభ్యుల్లో మిగిలిన 11మందిని సైత్తం త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.