ePaper
More
    Homeక్రీడలుRomario Shepherd | ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. ఆర్సీబీ బ్యాట‌ర్ అరాచ‌కానికి ఏకంగా 22...

    Romario Shepherd | ఇదేం బ్యాటింగ్ రా అయ్యా.. ఆర్సీబీ బ్యాట‌ర్ అరాచ‌కానికి ఏకంగా 22 ప‌రుగులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Romario Shepherd | ఈ మ‌ధ్య క్రికెట్‌లో బ్యాట‌ర్ల అరాచ‌కం ఎక్కువైంది. ఎలాంటి బౌల‌ర్ అయినా స‌రే, య‌థేచ్ఛగా బౌండ‌రీలు బాదుతూ ప‌రుగుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

    క్రికెట్‌లో (Cricket) ఒక్క బంతికి ఎక్కువలో ఎక్కువ 6 పరుగులే సాధ్యమన్న విష‌యం మ‌నంద‌రికి తెలుసు. కానీ ఓ బంతికి ఏకంగా 22 పరుగులు వచ్చాయని తెలిసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

    కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఆటగాడు రొమారియో షెఫర్డ్ (Romario Shepherd) ఈ అరుదైన ఫీట్‌ను సాధించాడు. ప్రస్తుతం గయానా అమెజాన్ వారియర్స్ తరఫున ఆడుతున్న రొమారియో షెఫర్డ్, సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు.

    Romario Shepherd | సునామీ ఇన్నింగ్స్..

    మ్యాచ్ 15వ ఓవర్‌లో ఓషానే థామస్ వేసిన ఓ బంతికి మొత్తంగా 22 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్‌లో… మొదటి బంతి – నో బాల్ కాగా, తర్వాత – వైడ్ బాల్, మళ్లీ – నో బాల్, అది కూడా సిక్సర్, మరో నో బాల్ – మళ్లీ సిక్సర్, తర్వాత లీగల్ డెలివరీకి మరో సిక్స్.. ఇవ‌న్నీ కలిపి ఒకే బంతి వేసేలోపు షెఫర్డ్ ఖాతాలో 22 పరుగులు చేరాయి.

    ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. త‌మ జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్.. కేవలం 34 బంతుల్లోనే 73 పరుగులు చేశాడు. చివరి 8 ఓవర్లలో గయానా అమెజాన్ వారియర్స్ 134 పరుగులు చేసి, మొత్తం స్కోరు 202/6గా ముగించారు. అయితే ఈ భారీ లక్ష్యాన్ని సెయింట్ లూసియా కింగ్స్ జట్టు 18.1 ఓవర్లలోనే ఛేదించింది.

    అకీమ్ అగస్టే 35 బంతుల్లో 73 పరుగులు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి కింగ్స్ విజయానికి బాటలు వేశాడు. రొమారియో షెఫర్డ్ ఐపీఎల్ 2025లో RCB తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 151 పరుగులు చేశాడు.

    Romario Shepherd | 14 బంతుల్లో ఆఫ్​ సెంచరీ

    ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో (Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి, ఐపీఎల్ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. రొమారియో షెఫర్డ్ ఆటలోని ధాటిని ఈ ఫీట్ మరోసారి నిరూపించింది. కేవలం ఒక్క‌ బంతికి 22 పరుగులు తెచ్చేసే స్థాయిలో అతని బ్యాటింగ్ ఉండటంతో.. త్వరలోనే మరిన్ని సర్ప్రైజ్ ఇన్నింగ్స్‌లకు ఈ స్టార్ ప్లేయర్ సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తోంది.

    Latest articles

    CM Revanth Reddy’s review | మెదక్‌ ఎస్పీ కార్యాలయంలో ముగిసిన సీఎం రేవంత్‌ రెడ్డి రివ్యూ.. ఏమేమి చర్చించారంటే..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth Reddy's review | వరద ప్రభావంపై మెదక్‌ ఎస్పీ కార్యాలయం (Medak SP...

    Minister Seethakka | కామారెడ్డికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కోరతాం: మంత్రి సీతక్క

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | భారీ వర్షాల ధాటికి కామారెడ్డి జిల్లాకు అధికనష్టం వాటిల్లినందున డ్యామేజీ కంట్రోల్...

    Hyderabad beach | హైదరాబాద్​కు బీచ్​.. 35 ఎకరాల్లో రూ.225 కోట్లతో నిర్మాణం!

    అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad beach : తెలంగాణ (Telangana) రాజధాని హైదరాబాద్​కు బీచ్​ రాబోతోంది. ఏమిటీ.. అసలు సముద్రమే...

    Armoor | భారీ శబ్ధానికి ఇంట్లోని వాళ్లందరూ షాక్​.. కళ్లు తెరిచి చూస్తే..

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలో రెండురోజుల నుంచి భారీ వర్షం(Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో...

    More like this