అక్షరటుడే, వెబ్‌డెస్క్: romantic affair | ఓ గురువు ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చ తెచ్చాడు. విద్యార్థినికి విద్యాబుద్ధులు చెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సింది పోయి, ఆమెను లోబర్చుకున్నాడు. అంతేకాకుండా పద్నాలుగేళ్లుగా ఆమెతో సంబంధం నెరుపుతూనే ఉన్నాడు. తాజాగా పెళ్లాం పిల్లలను వదిలి, సదరు యువతిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది.
నిజామాబాద్ జిల్లా Nizamabad district ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు teacher 2012వ సంవత్సరంలో జక్రాన్‌పల్లి మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తించేవాడు. ఆ సమయంలో అక్కడ తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని లోబర్చుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను వదలకుండా తన అక్రమ సంబంధం కొనసాగిస్తూనే ఉన్నాడు.
romantic affair | భార్యాపిల్లలకు వేధింపులు..
కాగా, సదరు కీచక ఉపాధ్యాయుడి భార్య కూడా ఉపాధ్యాయురాలే కావడం గమనార్హం. తన భర్త అక్రమ వ్యవహారం తెలిసి నిలదీయడంతో ఆమెపై పగబట్టాడు. భార్యతోపాటు పిల్లలను కూడా వేధించసాగాడు. అయితే ఇన్నేళ్లుగా ఓపికగా భరించిన ఆమె భర్త వేధింపులు తాళలేక గత నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అనంతరం నిజామాబాద్‌లోని మహిళా పోలీస్ స్టేషన్ Police Station లో కూడా ఫిర్యాదు చేయడంతో..పోలీసులు పలుమార్లు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కూడా సదరు ఉపాధ్యాయుడు తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. దీంతో సదరు కామాంధుడిని పోలీసులు గట్టిగానే మందలించారు. ఇదిలా ఉండగా.. ఇటీవలే సదరు యువతితో కీచక ఉపాధ్యాయుడు పారిపోయాడు. దీంతో బాధిత యువతి తల్లిదండ్రులు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.