ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Roja | జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఎమ్మెల్యే వ్యాఖ్యల వివాదం... రోజా గట్టి కౌంటర్

    Roja | జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై ఎమ్మెల్యే వ్యాఖ్యల వివాదం… రోజా గట్టి కౌంటర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Roja | టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్​పై (Jr. Ntr) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, ఆయన నటించిన వార్-2 సినిమా (War 2 Movie) ఎలా ఆడుతుందో చూస్తామని అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (MLA Daggupati Prasad) హెచ్చరించినట్టుగా వార్తలు రావడం… దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమనడం తెలిసిందే.

    ఎన్టీఆర్ అభిమానులు అనంతపురంలో ఎమ్మెల్యే ప్రసాద్ ఫ్లెక్సీలు ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై వైసీపీ మహిళా నేత రోజా ((YSRCP woman leader Roja) స్పందించారు.

    “ఇవేమైనా ఈవీఎంలు (Evms) అనుకున్నారా… మార్చివేసి మోసం చేయడానికి! సినిమాలు ఆడనివ్వబోమని హెచ్చరించడానికి వీళ్లెవరు? పెద్ద ఎన్టీఆర్ అభిమానులు, చిన్న ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చిన్న ఎన్టీఆర్ సినిమాలు చూస్తారు. వీళ్లు (టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్) చిన్న ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తాం అని బెదిరించడం చూస్తుంటే, అరచేతిని అడ్డంపెట్టి సూర్యుడ్ని ఆపేస్తాం అన్నంత హాస్యాస్పదంగా ఉంది. సినిమా బాగుంటే ఎవరూ ఏం చేయలేరు, ఎవరూ అడ్డుకోలేరు. సినిమా బాగాలేకపోతే ఎవరూ ఆడించలేరు. హరిహర వీరమల్లు విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎమ్మెల్యేలు తలకిందులుగా తపస్సులు చేసి, టికెట్లు ఫ్రీగా ఇస్తే కూడా వాళ్ల అభిమానులే థియేటర్లకు రాలేక ఏడుస్తూ ఆ సినిమాను ఎలా తిట్టారో మనం కళ్లారా చూశాం. ఇప్పటికైనా వాళ్లు తెలుసుకోవాల్సింది.. రాజకీయాలు రాజకీయల్లా చేయండి. సినిమాల విషయం సినిమావాళ్లు చూసుకుంటారు.

    సినిమా ఫంక్షన్లలో జగన్ (YS Jagan)ను తిట్టడం, సవాళ్లు విసరడం చేస్తే.. గేమ్ చేంజర్, హరిహరవీరమల్లు వంటి సినిమాలు ఏమయ్యాయో మనం కళ్లారా చూశాం. కాబట్టి, సినిమాను రాజకీయాన్ని మిక్స్ చేయొద్దు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లో లేరు.. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు. ఆయన సినిమాలు ఎలా హిట్టవుతున్నాయి, ఆయన పెర్ఫార్మెన్స్​కు ఇంటర్నేషనల్ లెవల్లో ఏ విధంగా అవార్డులు వస్తున్నాయి అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ, మైక్​లు ఉన్నాయని, పచ్చ చానళ్లు ఉన్నాయని, తాము ఏం చెప్పినా వింటారని అనుకుంటే.. చూసే జనం నవ్వుతారు” అంటూ రోజా వ్యాఖ్యానించారు.

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this