Homeక్రీడలుRohit Sharma | రోహిత్ శ‌ర్మ కారుని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ముంబైలో మ‌నోడికి ఇంత ఫాలోయింగా..!

Rohit Sharma | రోహిత్ శ‌ర్మ కారుని చుట్టుముట్టిన ఫ్యాన్స్.. ముంబైలో మ‌నోడికి ఇంత ఫాలోయింగా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rohit Sharma | టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకి ఉన్న‌ క్రేజ్ అంతా ఇంతా కాదు. “హిట్‌మ్యాన్” ఎక్కడికి వెళ్లినా అతడి కోసం వేలాది మంది ఫ్యాన్స్ పడిగాపులు కాస్తార‌న్న విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే.

తాజాగా ముంబై(Mumbai) వర్లి ప్రాంతంలో జరిగిన ఓ గణేశ పూజలో పాల్గొనడానికి రోహిత్ రావడంతో, అక్కడున్న ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ‌య్యారు. గణపతి పూజ(Ganesh Puja)లో పాల్గొనడానికి వర్లి ప్రాంతానికి వచ్చిన రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. అతడు కారులో వెళ్తున్న సమయంలో వేలాది మంది చుట్టుముట్టారు. దీంతో రోహిత్ కారు కదలడం కూడా కష్టమైంది. తనకోసం భారీగా వచ్చిన అభిమానులకు చేతులు ఊపి అభివాదం చేస్తూ, సన్‌రూఫ్‌ నుంచి బయటకు వచ్చి వారికి త‌న ప్రేమ‌నందించాడు.

Rohit Sharma | ఫ్యాన్స్ హంగామా..

హిట్‌మ్యాన్‌ని చూడ‌గానే.. ముంబై కా రాజా రోహిత్ శర్మ!(Rohit Sharma) అంటూ నినాదాలు చేశారు. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, రోహిత్ శర్మ ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ(BCCI) సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వద్ద నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టు విజయవంతంగా పూర్తి చేశాడు. దీంతో, త్వరలో జరిగే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కి రోహిత్ అందుబాటులో ఉంటాడు. కాగా రోహిత్ ఇప్పటికే టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేలకే పరిమితమై, 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు.

హిట్‌మ్యాన్ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై 76 పరుగులతో టీమిండియాను విజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అతడు 273 వన్డేల్లో 11,168 పరుగులు, 32 సెంచరీలు, 58 అర్థశతకాలు నమోదు చేశాడు. అయితే వర్లిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ చూపించిన ప్రేమ, రోహిత్ ఇచ్చిన స్పందన అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. నిజంగా చెప్పాలి అంటే.. రోహిత్ శర్మకు ఉన్న క్రేజ్‌కి ఇదొక మ‌చ్చుతునక మాత్రమే.

Must Read
Related News