అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి (Kokilaben Dhirubhai Ambani Hospital)లో కనిపించారు. రోహిత్ శర్మకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో రోహిత్ (Rohith Sharma) ఆరోగ్య పరిస్థితిపై అనేక ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే, రోహిత్ ఆస్పత్రికి ఎందుకు వెళ్లారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినప్పటికీ, కొందరు క్రికెట్ విశ్లేషకులు, రోహిత్ సమీప వర్గాల్లోని వారు చెబుతున్న సమాచారం ప్రకారం, ఇది కేవలం రొటీన్ హెల్త్ చెకప్ (Routine Health Checkup) మాత్రమేనని తెలుస్తోంది.
Rohith Sharma | ఎందుకు వెళ్లారు..
బిజీ షెడ్యూల్‌కు ముందు ఆటగాళ్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం సాధారణమైన విషయమేనని వారు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, రోహిత్ శర్మకు సన్నిహితులు లేదా స్నేహితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అటువంటి వారిని పరామర్శించేందుకు కూడా ఆయన ఆసుపత్రికి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. అయినప్పటికీ, ఈ విషయంపై ఆసుపత్రి యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ తరువాత రోహిత్ శర్మ చాలా కాలంగా క్రికెట్ మైదానానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కూడా రోహిత్ భారత్ తరపున ఆడలేదు. అయితే, ఇప్పుడు వన్డే కెప్టెన్‌గా అక్టోబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన వార్తలు అభిమానుల్లో కలవరాన్ని కలిగించినా, ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి సమస్యలేవీ లేవని తెలుస్తోంది. త్వరలోనే రోహిత్ శర్మ అధికారికంగా స్పందించే అవకాశం ఉండగా, ఆయన అభిమానులు ప్రస్తుతం కాస్త టెన్షన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.