అక్షరటుడే, వెబ్‌డెస్క్: IPL 2025 Eliminator match : ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. శుక్రవారం ముల్లాన్‌పూర్ వేదికగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ Mumbai Indians 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించింది.
కాగా.. ఈ గెలుపుతో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2(Qualifier-2) లో పంజాబ్ కింగ్స్‌తో ఆడనుండగా.. గుజరాత్ టైటాన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ మ్యాచ్‌లో మొత్తం 14 రికార్డ్స్ నమోదు కావడం విశేషం. మొదటిది.. ఐపీఎల్‌లో మొదటి ఓవర్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్( 32) చరిత్ర సృష్టించాడు. ఇక ఐపీఎల్ సీజన్‌లో స్పిన్‌పై స్వీప్ షాట్‌లతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా 162* – 2025లో సూర్యకుమార్ యాదవ్ (SR: 257.14) రికార్డ్ సృష్టించాడు.
IPL 2025 Eliminator match : రికార్డులు..
పురుషుల T20 పోటీలో అత్యధికంగా 25+ స్కోర్లు చేసిన ప్లేయర్ గాను 15* – సూర్యకుమార్ యాదవ్ IPL 2025 నిలిచాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ముంబై ఇండియన్స్ తరపున 84 పరుగులు రెండవ అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదైంది.
ఇక ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు100/2 – CSK vs PBKS, ముంబై WS, 2014 క్వాలిఫైయర్-2 కాగా, 79/0 – MI vs GT, ముల్లన్పూర్, 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో నమోదు చేశారు. ఇది IPL 2025లో MI అత్యధిక పవర్‌ప్లే స్కోరు 2022 నుంచి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ 37 సార్లు టాస్ గెలిచింది. ఈ కాలంలో ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోవడం ఇది మూడోసారి మాత్రమే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో అత్యధిక పరుగులు.. 973 – విరాట్ కోహ్లీ (2016) పేరు మీద ఉన్నాయి. ఈ సీజన్‌లో 760 – సాయి సుదర్శన్ (2025)* చేశాడు.
ఇక ఐపీఎల్ ప్లేఆఫ్స్ + ఫైనల్స్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు చేసిన ప్లేయర్లు చూస్తే… 7. సురేష్ రైనా ఉన్నారు. GT vs MI మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) 81 పరుగులు చేశాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఇది రోహిత్‌కి తొలి హాఫ్ సెంచరీ.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక సిక్సర్లు.. 357 – క్రిస్ గేల్ పేరిట ఉండగా, 300 – రోహిత్ శర్మ* ఆ రికార్డ్ బ్రేక్ చేసేందుకు దగ్గరలో ఉన్నాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు (పవర్ ప్లేలో)..33* vs GT vs MI (2025) . ఇక T20లో ఒక జట్టుకు అత్యధిక సిక్సులు.. 305 – విరాట్ కోహ్లీ (బెంగళూరు)Bengaluru ఉండగా, 264 – రోహిత్ శర్మ (ముంబై)* తర్వాతి స్థానంలో ఉన్నారు. ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి క్వాలిఫైయర్ 2కి చేరుకోవడంతో, వారి ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. ఈ విజయం ముంబైకి ఫైనల్‌కు చేరుకోవడానికి ఒక అడుగు దగ్గర చేసింది.