Homeక్రీడలుRohit Sharma | అట్ట‌హాసంగా రోహిత్ శ‌ర్మ స్టాండ్ ప్రారంభోత్సవ వేడుక‌.. సొంత అడ్డాలో మార్మోగనున్న...

Rohit Sharma | అట్ట‌హాసంగా రోహిత్ శ‌ర్మ స్టాండ్ ప్రారంభోత్సవ వేడుక‌.. సొంత అడ్డాలో మార్మోగనున్న హిట్ మ్యాన్ పేరు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ(Rohit Sharma) ఇటీవ‌ల టెస్ట్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించి అభిమానుల‌ని కాస్త నిరాశ‌కి గురి చేశాడు. మరికొన్నేళ్లు ఆడే సత్తా ఉన్నా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్-2025 మధ్యలోనే రిటైర్మెంట్ డెసిషన్ గురించి అనౌన్స్ చేశాడు. ఆల్రెడీ టీ20లకు గుడ్‌బై చెప్పిన హిట్‌మ్యాన్.. ఇక మీదట వన్డేల్లో మాత్రమే కొనసాగనున్నాడు. అయితే టీ20 వరల్డ్ కప్-2024ను సొంతం చేసుకోగానే తాను ఇంకొన్నాళ్లు ఆడాలని అనుకున్నానని, కానీ ఆ తర్వాత ఆలోచిస్తే టీమ్ నుంచి బయటకు వెళ్లడానికి అదే సరైన సమయమని అనిపించిందన్నాడు. ఇక ఇండియ‌న్ క్రికెట్‌కి ఎన్నో సేవ‌లు అందించిన క్ర‌మంలో ఐకానిక్ వాంఖడే స్టేడియం(Iconic Wankhede Stadium)లో ముంబై క్రికెట్ అభిమానులకూ, భారత క్రికెట్ చరిత్రకూ స్మరణీయ దృశ్యాన్ని అందించేలా ‘రోహిత్ శర్మ స్టాండ్’(Rohit Sharma Stand) ప్రారంభోత్సవ వేడుక మే 16న సాయంత్రం 4 గంటలకు జ‌ర‌ప‌నున్నారు.

Rohit Sharma | గ్రేట్ అచీవ్‌మెంట్

రేప‌టి నుండి ఐపీఎల్(IPL) 2025 వేడుక పునః ప్రారంభం కానుండ‌గా, ఈ రోజు రోహిత్ శ‌ర్మ స్టాండ్ ప్రారంభోత్స‌వ వేడుక నిర్వ‌హిస్తుండ‌డం విశేషం. భారత క్రికెట్‌(Indian Cricket)ను ప్రపంచ పటంలో నిలిపిన దిగ్గజ ఓపెనర్, మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వేడుకను ముందుగా మే 13న జరపాలని నిర్ణయించగా, భద్రతా సమస్యలు, పాకిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా BCCI ఐపీఎల్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. వాంఖడే స్టేడియంలోని తూర్పు విభాగంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక స్టాండ్ ఇప్పటికే రోహిత్ శర్మ పేరుతో ముస్తాబైంది. స్టాండ్‌పై రోహిత్ శర్మ పేరును గర్వంగా ప్రదర్శిస్తూ స్టేడియం మరింత మెరుగైన ఆకర్షణగా క‌నిపిస్తుంది.

ఇక ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, MCA అధ్యక్షుడు అజింక్య నాయక్, మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. అంతేకాకుండా, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేరుతో స్టాండ్‌లను పునఃప్రారంభించడమేకాక, మాజీ అధ్యక్షుడు అమోల్ కాలే జ్ఞాపకార్థం MCA కార్యాలయ లాంజ్‌కి కూడా ఆవిష్కరణ జరగనుంది. ఇక కెరీర్‌లో 499 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 49 సెంచరీలతో 19,700కి పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 పరుగులు ఇప్పటికీ ప్రపంచ రికార్డే. ఈ ‘రోహిత్ శర్మ స్టాండ్’ వాంఖడేలో స్థిరమైన గుర్తుగా నిలిచిపోతుంది. వాంఖడేలో ఈ మహోత్సవం భారత క్రికెట్ అభిమానులందరికీ గర్వంగా నిలిచే దృశ్యంగా మారనుందన‌డంలో అతిశ‌యోక్తి లేదు.