అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohit Sharma | టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కానీ ఈ సారి కారణం మ్యాచ్ గెలుపు కాదు, టోర్నమెంట్ జైత్రయాత్రలు కూడా కాదు.. తన సిక్సర్‌తో సొంత కారుని డ్యామేజ్ చేసుకోవడంతో హాట్ టాపిక్ అయ్యాడు.
విషయంలోకి వెళితే రాబోయే ఆస్ట్రేలియా(Australia) వన్డే సిరీస్‌కు సిద్ధమవుతున్న రోహిత్ శర్మ, ముంబైలోని శివాజీ పార్క్‌లో అభిషేక్ నాయర్ నేతృత్వంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ సుమారు రెండు గంటల పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో రోహిత్ భారీ సిక్సర్ బాదగా, బాల్ నేరుగా వెళ్లి ఆయనకు అత్యంత ఇష్టమైన లంబోర్ఘిని కారు(Lamborghini Car)పై పడినట్లు ప్రచారం జరుగుతోంది.
Rohit Sharma | వాట్ ఏ షాట్
ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే అది నిజమైనదేనా? ఎడిట్ చేసిన వీడియోనా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయినప్పటికీ, “హిట్‌మ్యాన్ పవర్ లెవెలే వేరయ్యా!” అంటూ నెటిజన్లు జోకులతో ఫన్నీ కామెంట్లు చేస్తుండటంతో ఇది ట్రెండింగ్‌లోకి ఎక్కింది. రోహిత్ శర్మ(Rohit Sharma) చాలా విరామం అనంతరం మళ్లీ జట్టులోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో టీ20 వరల్డ్‌కప్ గెలిపించి, తర్వాత టెస్టులకు వీడ్కోలు చెప్పిన రోహిత్… ఇప్పుడు వన్డే సిరీస్‌తో మళ్లీ జాతీయ జెర్సీని ధరించబోతున్నారు. అక్టోబర్ 19న ఆస్ట్రేలియాతో తొలి వన్డే జరగనుండగా, ఈ సిరీస్ కోసం భారత జట్టు అక్టోబర్ 15న ఆసీస్‌కి బయలుదేరనుంది.
ఇందులో రోహిత్‌తో పాటు, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలక ఆటగాళ్లు కూడా భాగం కానున్నారు. టీ20, టెస్టులకు వీడ్కోలు ఇచ్చిన తర్వాత రోహిత్, విరాట్ ఇద్దరూ పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ సమయంలో సొంత కారుకే సిక్సర్ బాదిన సంఘటన క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ శర్మ తన సొంత స్టయిల్లో పుల్ షాట్స్, కట్ షాట్స్, అలాగే స్పిన్ బౌలింగ్‌పై స్వీప్, స్లాగ్ స్వీప్ లాంటి షాట్స్ కోసం చాలా సేపు శ్రమించారు. కాగా, ఇటీవల రోహిత్ శర్మని వన్డే కెప్టెన్సీ నుండి తప్పించి గిల్‌కి ఆ బాధ్యతలు అందించిన విషయం తెలిసిందే.
ROHIT SHARMA IN THE PRACTICE SESSION.
– One of the shots broke his own Lamborghini. 🤣
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 10, 2025