ePaper
More
    Homeక్రీడలుrohit sharma retirement | ఎట్ట‌కేల‌కు త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. అదే కార‌ణ‌మట..!

    rohit sharma retirement | ఎట్ట‌కేల‌కు త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. అదే కార‌ణ‌మట..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rohit sharma retirement | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ Rohit Sharma తన టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్‌కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

    మానసికంగా చాలా అలసటకు గురవుతుండటమే టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణమని పరోక్షంగా రోహిత్​ వెల్లడించాడు. ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతుండగానే.. ఆకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ నిర్ణయం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యంలో ముంచింది.

    ఆపై కొద్ది రోజులకే విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో అనేక ఊహాగానాలు చెలరేగాయి. గౌతం గంభీర్ సూచనలతోనే వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే వీరిద్దరూ రిటైర్మెంట్‌కి గల కచ్చితమైన కారణాలను ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు.

    rohit sharma retirement : ఇది కార‌ణం..

    తాజాగా ఓ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రోహిత్, టెస్ట్ క్రికెట్ Test Cricket మానసికంగా ఎంతో ఒత్తిడిని కలిగించేది అని వెల్లడించాడు.

    “టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో ఓపిక అవసరం. ఐదు రోజుల పాటు మెంటల్‌గా చాలా కష్టపడాలి. ఇది నిజంగా చాలా ఛాలెంజింగ్. అలసట కలుగుతుంది..” అని రోహిత్ వ్యాఖ్యానించాడు.

    ఇక చిన్నప్పటి నుంచి రెండు, మూడు రోజుల పాటు జరిగే క్లబ్ మ్యాచ్‌లు ఆడుతూ ఈ ఫార్మాట్‌కి అలవాటు పడ్డామని కూడా చెప్పుకొచ్చాడు. ఆయన మాటల ప్రకారం చూస్తే.. టెస్ట్ ఫార్మాట్‌ను వీడటానికి మానసిక అలసటే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

    టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి Ravi Shastri ఓ సంద‌ర్భంలో మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ Virat Kohli టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవ‌డానికి ఇదే కారణం అని అభిప్రాయపడ్డారు.

    వన్‌డేలు, టీ20లతో పోలిస్తే టెస్ట్ క్రికెట్ పూర్తిగా వేరు… శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది అని అన్నారు.

    రోహిత్ టెస్ట్ కెరీర్ గమనిస్తే…

    • అరంగేట్రం: 2013లో
    • మ్యాచ్‌లు: 60
    • పరుగులు: 4374
    • సగటు: 45.10
    • శతకాలు: 12
    • ఇక చివరి మ్యాచ్: ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో. ఈ మ‌ధ్య రోహిత్ ఫామ్ లేకపోవడం, బరువు బాధ్యతలు, మానసిక ఒత్తిడి వీట‌న్నింటి వ‌ల‌న రోహిత్ టెస్ట్ కెరీర్ నుంచి ముందుగానే తప్పుకోవాల్సి వచ్చింది.

    Latest articles

    Heavy Rains | కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన.. స్తంభించిన జనజీవనం

    అక్షరటుడే, కామారెడ్డి/లింగంపేట : Heavy Rains | కామారెడ్డి (Kamareddy) జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టించింది. మంగళవారం...

    RTC Promotions | పండ‌గ వేళ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు సీఎం చంద్రబాబు ఆమోదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : RTC Promotions | వినాయక చవితి (Vinayaka Chaviti) సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా...

    Projects | ఎస్సారెస్పీ, నిజాంసాగర్​ ప్రాజెక్ట్​లకు పోటెత్తిన వరద.. గేట్లు ఎత్తివేత

    అక్షరటుడే, ఆర్మూర్​/నిజాంసాగర్​ : Projects | రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షం (Heavy Rain) పడుతోంది....

    Sundarakanda | ‘సుందరకాండ’ మూవీ రివ్యూ .. నారా రోహిత్ ఖాతాలో హిట్ చేరిందా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sundarakanda | ‘సుందరకాండ’ అంటే మనంద‌రికీ వెంట‌నే గుర్తుకు వచ్చేంది వెంకటేష్, మీనా, అపర్ణ...

    More like this