ePaper
More
    Homeక్రీడలుRohit Sharma | రోహిత్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    Rohit Sharma | రోహిత్ అభిమానుల‌కు గుడ్ న్యూస్.. తాజా పోస్ట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి వచ్చాడు. టెస్టులు, టీ 20ల నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన అనంతరం తన భవిష్యత్తుకు సంబంధించి ఉత్కంఠకు తెరదించుతూ, ప్రాక్టీస్ ప్రారంభించాడు.

    బుధవారం రోజు జరిగిన ట్రైనింగ్ సెషన్‌కు (Training Session) సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. రోహిత్ షేర్ చేసిన ఫోటోలలో మొదటిది జిమ్ వర్కౌట్స్ చేస్తున్నదీ అయితే, మరొక ఫొటోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్న‌ట్టు కనిపిస్తుంది. ఈ పోస్ట్‌పై ఫ్యాన్స్‌ నుంచి భారీ స్పందన వస్తోంది. మళ్లీ మైదానంలో మిమ్మల్ని చూసేందుకు ఎదురుచూస్తున్నాం, కెప్టెన్!” , “2027 వరల్డ్‌కప్‌ కోసం సిద్ధమవుతున్నారుగా!” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.

    Rohit Sharma | రోహిత్ ఈజ్ బ్యాక్..

    కొద్ది రోజుల క్రితం అర్ధ‌రాత్రి రోహిత్ శ‌ర్మ (Rohith Sharma) ఆస్పత్రిలో క‌నిపించే స‌రికి అంద‌రు ఆందోళ‌న చెందారు. హిట్ మ్యాన్‌కు ఏమైంద‌నే టెన్ష‌న్ పడ్డారు. కాని ఇప్పుడు ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌డంతో రోహిత్ ఆరోగ్యం విష‌యంలో ఎలాంటి టెన్ష‌న్ అక్క‌ర్లేద‌ని కూల్ అయ్యారు. ఇటీవలే టెస్టులు, టీ20ల నుంచి రిటైర్మెంట్ (Retirement) ప్రకటించిన రోహిత్, ఇకపై తన పూర్తి దృష్టిని వన్డే ఫార్మాట్​పై సారించనున్నాడు. ఇందులో భాగంగా అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియా(Australia)తో మొదలయ్యే మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ కూడా పాల్గొననున్నాడు. ఇద్దరూ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యారు.

    రోహిత్ వన్డే రికార్డ్స్ చూస్తే.. 273 వన్డేలు, 11,168 పరుగులు, 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో 30 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 1,328 పరుగులు, 5 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియా మైదానాల్లో రోహిత్ శర్మకు ఉన్న అద్భుతమైన ట్రాక్ రికార్డ్ కారణంగా అభిమానులు ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వన్డేల్లో తిరుగులేని బ్యాట్స్‌మెన్‌గా పేరు సంపాదించుకున్న‌ హిట్‌మ్యాన్‌ మళ్లీ ఫామ్‌లోకి వస్తే, 2027 వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా బ‌లం మ‌రింత పెరిగిన‌ట్టే అని ముచ్చ‌టించుకుంటున్నారు.

    More like this

    Megastar Chiranjeevi | చిరంజీవికి ఇప్ప‌టికీ త‌న భార్య అంటే అంత భ‌య‌మా.. కూతురు చెప్పిన సీక్రెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Megastar Chiranjeevi | సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా... భార్య ముందు భర్తలు కొంచెం...

    Urea | యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Urea | అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. యూరియా కోసం తిరిగితిరిగి అలిసిపోయిన అన్నదాతలు రోడ్డెక్కారు....

    Telusu Kada Teaser | ఈ సారి ఇద్ద‌రు అమ్మాయిల‌తో రొమాన్స్‌కి రెడీ అయిన సిద్ధు.. హైప్స్ పెంచిన తెలుసు క‌దా టీజ‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telusu Kada Teaser | డీజే టిల్లు చిత్రంతో ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన యువ...