అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohith Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇప్పుడు టెస్ట్, టీ20 క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నాడు. సాధారణంగా రోహిత్ శర్మ(Rohith Sharma) మైదానంలో చాలా సీరియస్‌గా కనిపిస్తాడు. నవ్వడం, డ్యాన్స్ చేయడం వంటి వాటికి రోహిత్ దూరంగా ఉంటాడేమో అని అనిపించే వారికి, ఈ వీడియో మాత్రం షాకింగ్‌గా ఉంటుంది. రోహిత్ తన భార్య రితికా సజ్దే(Rohit Wife Ritika Sajde)తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో అసలు ఇప్పటిదేమీ కాదు. 2023లో రితిక సోదరుడి పెళ్లి సందర్భంగా జరిగిన వేడుకలో రోహిత్ శర్మ డ్యాన్స్ చేసిన వీడియో ఇది.
Rohith Sharma | రోహిత్‌లోని వెరైటీ యాంగిల్..
స్టేజ్ మీద రితికతో పాటు పెళ్లి కూతురి బృందంతో కూడా రోహిత్ సరదాగా స్టెప్పులు వేసాడు.అంతేకాదు, స్టేజ్ షోకు ముందు ఇంట్లో ప్రాక్టీస్ చేసిన ఫుటేజ్ కూడా ఈ వీడియోలో కనిపిస్తుంది. నిజంగా ఇది చూడముచ్చటగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తుండగా, ఫ్యాన్స్ రోహిత్ డ్యాన్స్(Rohith Dance) చూసి మురిసిపోతున్నారు. రోహిత్ శర్మలో ఈ సరదా కోణం ఎప్పుడు చూడలేదే అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో వారు “లాల్ ఘాగ్రా” వంటి బాలీవుడ్ పాటలకు డ్యాన్స్ చేసినట్లు కనిపిస్తుంది.
38 ఏళ్ల రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు, టీ20 ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం ఫామ్‌లో లేకపోవడం, రోహిత్ స్థిరమైన ప్రదర్శన చేయడం దీనికి కారణం. ఆసియా కప్ 2025 Asia Cup 2025 సెప్టెంబరులో ప్రారంభం కానుంది కానీ అది టీ20 ఫార్మాట్ కావడంతో రోహిత్ ఆ టోర్నీలో కనిపించడు.ఇక రోహిత్ శర్మను టీమిండియా జెర్సీలో మళ్లీ చూసే అవకాశం అక్టోబర్లోనే ఉంది. భారత్-ఆస్ట్రేలియా సిరీస్‌లో మూడు వన్డేలు, ఐదు టీ20లు జరగనున్నాయి. వన్డేలు అక్టోబర్ 19 నుంచి 25 వరకు జరుగనున్నాయి. ఇప్పుడు రోహిత్ శర్మ డ్రీమ్ వన్డే వరల్డ్ కప్ గెలవడం అని ఇప్పటివరకు అనేకసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ముంబైలో మాజీ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ప్రాక్టీస్ ప్రారంభించాడు.
Rohit Sharma and Ritika bhabhi from practicing dance at home to dancing on stage during Ritika’s brother wedding.🔥❤️ pic.twitter.com/xfSQ5mE3JG
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 13, 2025