అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rohit Virat Retirement | ఆస్ట్రేలియాతో Australia జరిగిన మూడో వన్డేలో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన బ్యాటింగ్‌తో భారత్ 168 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి ఆసీస్‌ని చివరి వన్డేలో చిత్తుగా ఓడించింది.
అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో భావోద్వేగాలను రేకెత్తించాయి.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ Rohit Sharma, “ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ ప్రత్యేకం. 2008లో ఇక్కడ మొదటిసారి ఆడిన జ్ఞాపకాలు ఇంకా తాజాగానే ఉన్నాయి. కానీ, మళ్లీ ఇక్కడ ఆడటానికి వస్తానో లేదో తెలియదు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో అభిమానుల్లో కలకలం చెలరేగింది.
Rohit Virat Retirement | రిటైర్మెంట్‌పై చర్చలు..
రోహిత్ మరి కొద్ది రోజులలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకబోతున్నారేమోనని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇక కోహ్లీ కూడా మ్యాచ్ తర్వాత ఆస్ట్రేలియా అభిమానులకు చేతులెత్తి నమస్కరించారు.
“ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ గౌరవంగా ఉంటుంది. అభిమానుల ప్రేమకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు” అని అన్నారు. ఆయన అభివాదం, చిరునవ్వు అభిమానులను మరింత ఎమోషనల్‌గా మార్చింది.
రోహిత్ “మళ్లీ వస్తానో లేదో తెలియదు” అన్న మాట, కోహ్లీ భావోద్వేగ అభివాదం.. ఈ రెండు సంఘటనలు కలిసి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.
అభిమానులు ట్విట్టర్ (X), ఇన్‌స్టాగ్రామ్‌లలో #ThankYouRohit, #ThankYouVirat హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్టులు పెడుతున్నారు. చాలామంది “మీరు ఇద్దరూ ఇంకా ఆడాలి, రిటైర్ అవ్వకండి” అంటూ అభ్యర్థిస్తున్నారు.
ఒక అభిమాని ట్వీట్ చేస్తూ.. “ఇండియన్ క్రికెట్ Indian cricket ఈ ఇద్దరితోనే మహోన్నత స్థాయికి చేరింది. వీరు మైదానాన్ని వదిలేస్తే అది యుగాంతం లాంటిదే” అని రాశాడు.
మరో అభిమాని, “రోహిత్, కోహ్లీ Virat Kohli లేకుండా టీమ్ ఇండియాను ఊహించలేం” అంటూ ఎమోషనల్ పోస్టు చేశాడు.
ఇక వారి రిటైర్మెంట్ గురించి అధికారికంగా బీసీసీఐ నుంచి కాని, ఆటగాళ్ల నుంచి కాని ఎలాంటి రిటైర్మెంట్ ప్రకటన రాలేదు. అయితే అభిమానులు మాత్రం “ఇది వారి చివరి ఆస్ట్రేలియా టూర్ అయి ఉండొచ్చు” అని భావిస్తున్నారు.
