ePaper
More
    Homeక్రీడలుRohit Sharma | రోహిత్​ శర్మ సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్

    Rohit Sharma | రోహిత్​ శర్మ సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohit Sharma | టీమిండియా క్రికెటర్​​ రోహిత్​ శర్మ Rohit Sharma సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్​ క్రికెట్ test cricket ​కు వీడ్కోలు retirement పలుకుతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ వేదికగా రోహిత్​ ప్రకటించాడు.

    ‘‘నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. తెల్ల దుస్తులు ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. ఏళ్లుగా మీ ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను” అని రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

    రోహిత్​ శర్మ టీ 20 వరల్డ్​ కప్ t 20 world cup​ గెలిచిన తర్వాత టీ 20 ఫార్మాట్​కు రిటైర్మెంట్​ ప్రకటించాడు. తర్వాత ఆయన టెస్టుల్లో కెప్టెన్​గా కొనసాగాడు. అయితే బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో రోహిత్​ విఫలం అయ్యాడు. ఆయన ఆఖరి టెస్ట్​ మ్యాచ్​ కూడా బోర్డర్​ గావస్కర్​ సిరిస్​లోని నాలుగో టెస్ట్​ మ్యాచ్​. ఆ సిరిస్​లో హిట్​ మ్యాన్​ విఫలం కావడంతో ఆఖరు టెస్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. కాగా ఆ సిరీస్​ను భారత్​ 1–3 తేడాతో ఓడిపోయింది. అనంతరం టెస్టులు ఆడని రోహిత్​ తాజాగా రిటైర్మెంట్​ ప్రకటించాడు. అయితే వన్డేల్లో మాత్రం కొనసాగుతానని రోహిత్​ తెలిపాడు.

    రోహిత్​ శర్మ టెస్టుల్లో 116 ఇన్నింగ్స్‌లలో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే 2024లో జరిగిన టెస్ట్​ల్లో ఈ హిట్​మ్యాన్​ విఫలం అయ్యాడు. మరోవైపు కెప్టెన్​గా రోహిత్​ 24 టెస్ట్​లకు నాయకత్వం వహించాడు. ఇందులో 12 మ్యాచుల్లో భారత్​ గెలవగా.. తొమ్మిదింట్లో ఓడిపోయింది.

    Latest articles

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    Kaleshwaram | కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ను తిలకించిన నేతలు

    అక్షరటుడే, కామారెడ్డి: Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారంపై మంగళవారం బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో...

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    More like this