అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | భారత వన్డే జట్టులో ఊహించని మార్పు జరిగింది. వన్డే ఫార్మాట్‌కి ఇప్పటి వరకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ (Rohith Sharma) స్థానాన్ని ఇక శుభ్‌మన్ గిల్ (Shubman gil) తీసుకోనున్నాడని తెలుస్తోంది.
గిల్‌ను వన్డేలకు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ సెలెక్టర్లు (BCCI selectors) ఎంపిక చేయబోతున్నారని సమాచారం. గత కొద్ది రోజులుగా వన్డేల నుండి రోహిత్‌ని తప్పించనున్నారని ప్రచారం జరగగా, ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. ఇక ప్లేయర్‌గా మాత్రమే రోహిత్ కొనసాగనున్నాడు. ఇక గిల్ ప్రస్తుతం టెస్ట్ కెప్టెన్‌గా ఉండగా, రానున్న సిరీస్‌లో వన్డే కెప్టెన్‌గా కూడా గిల్ ఆడనున్నాడని టాక్ నడుస్తుంది.
BCCI | రోహిత్ ఔట్..
ఇంగ్లాండ్‌తో జరిగిన అయిదు టెస్టుల అండర్సన్-టెండుల్కర్ సిరీస్‌లో (Anderson-Tendulkar series) గిల్ అద్భుతంగా రాణించాడు. తొలి టెస్ట్ సిరీస్ లోనే జట్టును విజయవంతంగా నడిపించి, సిరీస్‌ను 2-2తో సమం చేశాడు. ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli) లేకపోయినా.. జట్టును సమర్థంగా నడిపించాడు. తాజాగా వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో కూడా గిల్ అద్భుతంగా జట్టుని నడిపించాడు. ఈ క్రమంలో గిల్ కెప్టెన్సీ అనివార్యం అయింది. రోహిత్ ఇప్పటికే టీ20, టెస్టు ఫార్మట్ల నుంచి తప్పుకున్నాడు. వన్డే ఫార్మట్‌లో మాత్రం కొనసాగుతున్నాడు.
కానీ అతని వయసు, ఫిట్‌నెస్ దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ (BCCI) ఈ కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే అతన్ని వన్డే కెప్టెన్సీ (ODI captaincy) నుంచి తప్పించాలని డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే.మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండాలని భావించారు. ప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉన్నారు.
టెస్టులకు: శుభ్‌మన్ గిల్, టీ20లకు సూర్యకుమార్ యాదవ్, వన్డేలకు .. ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఉన్నారు. త్వరలో గిల్ ఆ బాధ్యతలు మోయనున్నారు. గిల్ ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “జట్టులో యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు కెప్టెన్ వాళ్లకు ఆదర్శంగా ఉండాలి. గిల్ తన ఆటతో, నాయకత్వంతో అది చేసి చూపించాడు” అని వారు చెప్పారు. ఇక రాబోయే ఆస్ట్రేలియాతో (Australia) వన్డే సిరీస్ కోసం భారత జట్టుకు గిల్ కెప్టెన్‌గా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.