- Advertisement -
Homeక్రీడలుShubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా...

Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పుల‌కు నాంది పలికినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇప్పుడు వన్డే ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు చెబుతారా? అనే చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టు సత్తా చాటడంతో, టీమిండియా(Team India)లో సీనియర్ ఆటగాళ్ల అవసరం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రోహిత్-కోహ్లీకి భవిష్యత్తులో జట్టులో చోటు ఉంటుందన్న దానిపై BCCI, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

Shubhman Gill | వారిపై వేటు..

2027లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌(One Day World Cup) కోసం ఇప్పుడు నుంచే బలమైన జట్టును సిద్ధం చేయాలన్నది బీసీసీఐ లక్ష్యం. అయితే అప్పటికి విరాట్ కోహ్లీ వయసు 38, రోహిత్ శర్మ 40 ఉంటుంది. అంతవరకు ఫామ్ కొన‌సాగించ‌డం సాధ్యమా? అనే సందేహాలు క‌లుగుతున్నాయి.. రీసెంట్‌గా ఓ బీసీసీఐ అధికారి(BCCI Officer) మీడియాతో మాట్లాడుతూ .. రోహిత్, కోహ్లీ భవిష్యత్‌పై త్వరలో చర్చిస్తాం. వన్డే వరల్డ్‌కప్ కోసం ప్లాన్ సెట్ చేయాలి. వాళ్లను తప్పుకోమని ఒత్తిడి చేయం కానీ వారి శారీరక, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నదే ఉద్దేశం అని తెలిపారు. హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్(Gautam Gambhir) ఇప్పటికే జట్టులో పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. యువ ఆట‌గాళ్ల‌కి అవకాశాలు ఇచ్చే దిశగా ఆయన ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

2027 ప్రపంచకప్ గెలవడం ప్ర‌ధాన ల‌క్ష్యం కాగా, దీనికి అనుగుణంగా, ఇప్పటినుంచి కుర్రాళ్లను ప‌రీక్షించాల‌ని అనుకుంటున్నార‌ట‌. రోహిత్, కోహ్లీ ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌లో జట్టులోకి తిరిగి వస్తారు. అనంతరం నవంబర్‌లో సౌతాఫ్రికాతో మరో సిరీస్ లో పాల్గొంటారు. ఈ రెండు సిరీస్‌లలో మంచి ఆట‌తీరు క‌న‌బరిస్తేనే కొనసాగే అవకాశం ఉంది. లేదంటే వారిని పక్కన పెట్టే అవకాశం కూడా లేక‌పోలేదు. కాగా, మాజీ క్రికెట‌ర్ మహ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్‌లో శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీ(Shubman Gill Captaincy)పై ప్రశంసల వర్షం కురిపించాడు. రోహిత్ ఎంత కాలం కెప్టెన్‌గా ఉంటాడో తెలియ‌దు. ఆ త‌ర్వాత గిల్ కెప్టెన్సీ స్వీక‌రించ‌డానికి రెడీగా ఉన్నాడు అని కైఫ్ అన‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి గిల్‌పైనే ప‌డింది. ఇంగ్లాండ్‌లో టెస్ట్ కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించిన తీరు చూశాక వ‌న్డే కెప్టెన్‌గా కూడా గిల్‌కి బాధ్య‌తలు అప్ప‌గించాల‌ని అంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News