అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Team India | న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు ముందు రోహిత్ శర్మ,(Rohit Sharma) విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఇలాంటి విధ్వంసకర ఫామ్‌లోకి రావడం టీమిండియాకి ఆనందాన్ని కలిగిస్తుంది. “క్లాస్ ఈజ్ పర్మనెంట్” అని తాజా ఇన్నింగ్స్‌తో రోహిత్, కోహ్లీ మరోసారి చాటిచెప్పాడు.
ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరోసారి తన క్లాస్‌ను చాటాడు. దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన కోహ్లీ.. తొలి మ్యాచ్‌లోనే శతకంతో చెలరేగి అభిమానులను ఉర్రూతలూగించాడు. బుధవారం బెంగళూరులోని బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ గ్రౌండ్లో ఆంధ్రతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తరఫున ఆడిన విరాట్ కోహ్లీ 101 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో అద్భుతమైన 131 పరుగులు నమోదు చేశాడు. ఇది గత ఐదు వన్డే మ్యాచ్‌ల్లో కోహ్లీకి మూడో శతకం కావడం విశేషం. అలాగే లిస్ట్-ఏ క్రికెట్లో 330 ఇన్నింగ్స్‌ల్లో అతను 58 శతకాలు పూర్తి చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ (60 శతకాలు) రికార్డుకు కోహ్లీ కేవలం రెండు శతకాల దూరంలో నిలిచాడు.
Team India | కోహ్లీ నాయకత్వంలో ఢిల్లీ ఛేజ్
మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆంధ్ర జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఆంధ్ర బ్యాటర్లలో రికీ భుయ్ అద్భుతంగా రాణించాడు. 105 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 122 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోర్ అందించాడు. అయితే నితీష్ రెడ్డి (23) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు (Delhi Team) ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగగా, ప్రియాన్ష్ ఆర్య (74), నితీష్ రాణా (77) (Nitish Rana) కీలక అర్ధశతకాలతో అతనికి అద్భుతమైన సహకారం అందించారు. ఫలితంగా ఢిల్లీ 37.4 ఓవర్లలోనే 6 వికెట్లకు 300 పరుగులు చేసి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆంధ్ర బౌలర్లలో నితీష్ కుమార్ రెడ్డి ఒక వికెట్ తీయగా, సత్యనారాయణ రాజు, మారమ్రెడ్డి హేమంత్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. నర్సింహ్మా రాజు ఒక వికెట్ సాధించాడు. అయినప్పటికీ కోహ్లీ ధాటికి ఆంధ్ర బౌలింగ్ నిలువలేకపోయింది.15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీకి తిరిగి వచ్చి తొలి మ్యాచ్‌లోనే శతకంతో సత్తా చాటిన విరాట్ కోహ్లీ.. దేశవాళీ క్రికెట్‌కు మరోసారి కొత్త వెలుగు నింపాడని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు విజయ్ హజారే ట్రోఫీ 2025-26 గ్రూప్-సి మ్యాచ్‌లో రోహిత్ సెంచరీతో మెరిసాడు. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత దేశవాళీ వన్డే టోర్నీలో ముంబై తరపున బరిలోకి దిగిన రోహిత్ సిక్కిం బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో చెడుగుడు ఆడుకుంటూ కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. సిక్కిం జట్టు 50 ఓవర్లలో 236 పరుగులు చేయగా, ముంబై ఆ లక్ష్యాన్ని సులువుగా చేధించింది.