ePaper
More
    HomeతెలంగాణRobbery on the road | కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ.. రూ. 40...

    Robbery on the road | కళ్లల్లో కారం కొట్టి దారి దోపిడీ.. రూ. 40 లక్షలు దోచుకుని పారిపోతుండగా ట్విస్ట్​!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Robbery on the road | దోపిడీ దొంగలు బరి తెగించారు. దారిదోపిడీకి దిగారు. కళ్లల్లో కారం కొట్టి ఉన్నదంతా దోచుకున్నారు. అందినంత అందుకుని పారిపోతుండగా ప్రమాదానికి గురయ్యారు.

    హైదరాబాద్ Hyderabad కు చెందిన రాకేష్ అగర్వాల్ స్టీలు వ్యాపారం steel trader చేస్తున్నారు. రాకేష్​ తన కారు డ్రైవర్​తోపాటు వ్యాపార business భాగస్వామిని వికారాబాద్ పంపించారు. అక్కడి నుంచి నుంచి రూ.40 లక్షల నగదు తీసుకుని రావాలని పంపించారు.

    దీంతో కారు డ్రైవరు, అతని వ్యాపార భాగస్వామి కలిసి వికారాబాద్ Vikarabad వెళ్లారు. రూ.40 లక్షల నగదు తీసుకున్నారు. ఇద్దరు కలిసి శంకర్​పల్లి మీదిగా కీసరకు బయల్దేరారు. శంకర్​పల్లి మండలం పర్వేడ వద్దకు చేరుకున్నాక ఊహించని ఘటన చోటుచేసుకుంది.

    పర్వేడ వద్ద వీరి కారును వెనుక నుంచి ఓ స్విఫ్ట్ గట్టిగా ఢీ కొంది. వెంటనే అందులో నుంచి దిగిన దుండగులు రాకేశ్​ పనులపై మెరుపు దాడికి దిగారు. వారిపై కారంపొడి చల్లారు. నకిలీ గన్నుతో బెదిరించారు. వారిని భయపెట్టి రూ. 40 లక్షలు తీసుకుని పారిపోయారు.

    Robbery on the road | బోల్తా పడిన వాహనం..

    అలా దుండగులు పారిపోతుండగా.. కొత్తపల్లి వద్ద వారి వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఖంగుతిన్న దుండగులు బోల్తా పడిన వాహనం నుంచి బయటకు వచ్చారు. డబ్బుతో పోయేందుకు ప్రయత్నించారు. కాగా, స్థానికులు గుర్తించి నిలదీయడంతో భయపడిపోయిన దుండగులు కొంత నగదు అక్కడే వదిలేసి, మిగతా మొత్తాన్ని తీసుకుని పలాయనం చిత్తగించారు.

    సమాచారం అందుకున్న శంకర్​పల్లి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బోల్తా పడిన వాహనం నుంచి రూ. 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఉపయోగించిన పిస్తోల్ డమ్మీదని నిర్ధారించారు. వాహనం నంబరు ప్లేటు సైతం డమ్మీదని గుర్తించారు.

    పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్​ మనుషులు పెద్ద మొత్తంలో నగదు తీసుకొస్తున్నట్లు దుండగులకు ఎవరు సమాచారం అందించారు..? రాకేష్​ మనుషుల పాత్ర..? నగదు ఇచ్చిన వారు ఎవరు..? అసలు ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎక్కడిది..? దీనికి టాక్స్ చెల్లించారా..? వైట్​ మనీనా..? లేక బ్లాక్​ మనీనా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

    కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్ అగర్వాల్ మనుషులు రూ.40లక్షల తీసుకువస్తున్నారని దుండగులకు ఎవరు సమాచారం ఇచ్చారన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

    More like this

    stone quarry explosion | రాతి క్వారీలో ఘోరం.. భారీ పేలుడు.. ఆరుగురు కార్మికుల దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: stone quarry explosion : పశ్చిమ బెంగాల్‌ West Bengal లో ఘోర ప్రమాదం సంభవించింది....

    Karnataka Fatal accident | కర్ణాటకలో ఘోర ప్రమాదం.. భక్తులపైకి దూసుకెళ్లిన కంటైనర్.. ఎనిమిది మంది దుర్మరణం

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Karnataka Fatal accident : కర్ణాటక Karnataka లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ...

    He married hijra | హిజ్రాను ప్రేమించాడు.. పెళ్లి కూడా చేసుకున్నాడు.. ఎక్కడంటే..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: He married hijra | ఆ యువకుడు సాధారణ ఉద్యోగి.. తన తోటి ఉద్యోగుల్లో ఒకరు...