అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లో గల ఖజానా జ్యువెలరీలో (Khajana Jewellery) ఇటీవల దోపిడీ జరిగిన విషయం తెలిసిందే. ఆరుగురు వ్యక్తులు దుకాణంలోకి చొరబడి తుపాకులతో బెదిరించి దోపిడీ చేశారు. అడ్డువచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. దీంతో పోలీసులు పది బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు శనివారం మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ (Madhapur DCP Vineeth Kumar) తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు.
Hyderabad | బీహార్‌కు చెందిన ముఠా
బీహార్‌కు చెందిన ముఠా ఈ దోపిడీ చేసినట్లు డీసీపీ తెలిపారు. మొత్తం ఏడుగురు నిందితులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. అందులో ఇద్దరు నిందితులు ఆశిష్ కుమార్ సింగ్ (22), దీపక్ కుమార్ సాహూ (22) షాను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితులు బిహార్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ (Bihar Most Wanted Criminals) అని ఆయన పేర్కొన్నారు. ఒక్కొక్కరిపై 10 కేసులు ఉన్నాయన్నారు. వారు 20 రోజుల క్రితం హైదరాబాద్(Hyderabad)కు వచ్చారన్నారు. సెకండ్ హ్యాండ్లో బైక్‌లు కొనుగోలు చేశారు. పోలీసుల నిఘా ఎక్కువగా లేని చందానగర్ (Chanda Nagar) ఖజానా జ్యువెల్లరీ చోరీ చేయాలని ప్లాన్ వేశారు. 20 రోజుల పాటు రెక్కి నిర్వహించారు. అనంతరం ఆగస్టు 12న తుపాకులతో నగల దుకాణంలోకి చొరబడ్డారు.
Hyderabad | ఇతర రాష్ట్రాల్లోనూ దోపిడీ
దోపిడీకి పాల్పడిన నిందితుడు ఆశిష్కుమర్ను మహారాష్ట్ర(Maharashtra)లో అరెస్ట్ చేసినట్లు డీసీపీ తెలిపారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు మరో నిందితుడు దీపక్‌కుమార్‌ను సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి నుంచి నాటు తుపాకులు, బులెట్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 10 కిలోల వెండి ఆభరణాలు, వస్తువులతో దొంగలు పరారు కాగా.. 900 గ్రాముల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కోల్‌కతా, బిహార్, కర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు.