అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | కామారెడ్డిలో (Kamareddy) దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న దేవునిపల్లిలో భారీ చోరీకి పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. దేవునిపల్లి గ్రామంలోని (Devunipalli village) మెడికల్ కళాశాల సమీపంలో గల వినాయక నగర్లో జరిగిన చోరీ మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
కాలనీలో నివాసముండే చంద్రమోహన్ రెడ్డి ఇంట్లో ఏకంగా 6.5 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు, సుమారు రూ.2.5 లక్షల నగదు దుండగులు ఎత్తుకెళ్లారు. రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లిన చంద్రమోహన్ కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి తాళం పగులగొట్టి ఉంది. అనుమానం వచ్చి ఇంట్లోకి వెళ్లి చూడగా బెడ్ రూంలో ఉన్న బీరువా తాళం పగులగొట్టి మంచంపై వస్తువులు చిందరవందరగా పడి ఉండడాన్ని గమనించి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు చేరవేశాడు. దాంతో దేవునిపల్లి ఎస్సై భువనేశ్వర్ (Devunipalli Sub-Inspector Bhubaneswar) ఘటనాస్థలికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు.
Kamareddy | రెచ్చిపోతున్న దొంగలు
గత కొంతకాలంగా కామారెడ్డి పట్టణ (Kamareddy town) శివారులో దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రిపూట గ్రూపులుగా వచ్చి తాళం వేసి ఇళ్లను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీకి పాల్పడిన దొంగల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మారణాయుధాలతో వస్తున్న దొంగలు తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కాలనీల్లో పోలీసుల పెట్రోలింగ్ తగ్గిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
1 comment
[…] త్వరలోనే వెయ్యి మందితో కామారెడ్డి (Kamareddy) జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన […]
Comments are closed.