అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ (Delhi) పర్యటనలో భాగంగా యూఎస్ – ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్రస్థానంలో ఉన్న హైదరాబాద్ (Hyderabad) నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానం అని ఆయన పేర్కొన్నారు.
భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని సీఎం అన్నారు. అయితే హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని తాము అనుకుంటున్నామని చెప్పారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్ (Google), మెటా(Meta), టీసీఎస్(TCS), ఇన్ఫోసిస్ వంటి కార్పొరేట్ సంస్థల పేర్లను పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy | పెట్టుబడులు పెట్టండి
దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన ద్వారం అని సీఎం అన్నారు. జీసీసీలకు (GCCs) గమ్యస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన పరిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామన్నారు.
గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే, తక్కువ ఖర్చుతో, సులభమైన వీసా విధానాల ద్వారా గ్లోబల్ సౌత్ విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ప్రపంచస్థాయి విద్యాసంస్థలను ఆహ్వానించారు. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటనను ముగించుకొని హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
1 comment
[…] ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) […]
Comments are closed.