అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | రోడ్డు భద్రతా (road safety) ప్రమాణాలను పెంచుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించుకునే అవకాశం ఉంటుందని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. నగరంలోని సీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సేవ్ లైఫ్ ఫౌండేషన్ (Save Life Foundation), మెర్సిడెస్ బెంజ్ ఇండియా (Mercedes Benz India) ఆధ్వర్యంలో పోలీసులు శాస్త్రీయ రోడ్డు భద్రత విధానాలపై వన్డే వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. అత్యాధునిక సాధనాలు, పద్ధతుల ద్వారా రోడ్డు భధ్రతను పెంచవచ్చన్నారు. నిజామాబాద్‌ను రోడ్డు భద్రతకు ఒక నమూనాగా మార్చడానికి కృషి చేస్తామని చెప్పారు.