అక్షరటుడే, బోధన్ : RTA Nizamabad | రోడ్డు భద్రత నియమాలను ప్రతిఒక్కరూ పాటించాలని డీటీవో ఉమా మహేశ్వర్ రావు (DTO Uma Maheshwar Rao) సూచించారు. రోడ్డు భద్రత ఉత్సవాల్లో భాగంగా బుధవారం నవీపేట్ స్కాలర్స్ హైస్కూల్ , లిటిల్ ఫ్లవర్ హైస్కూల్లలో (Little Flower High School) విద్యార్థులకు ఆర్టీఏ నిబంధనలపై అవగాహన కల్పించారు.
RTA Nizamabad | పిల్లలు పెద్దలకు తెలియజేయాలి
ఈ సందర్భంగా ఆర్టీవో ఉమామమేశ్వ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు అవగాహన కార్యక్రమాల్లో తెలుసుకున్న విషయాలను తమ తల్లిదండ్రులకు వివరించాలన్నారు. రోడ్డు భద్రత పాటించకుండా వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగితే ఇరు కుటుంబాల్లోనూ విషాదం నెలకొంటుందన్నారు. కార్యక్రమంలో భాగంగా నవీపేట్ స్కాలర్స్ హైస్కూల్‌లో (Navipet Scholars High School) 1300 మంది విద్యార్థులు, లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పాఠశాల సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. అలాగే రెండు పాఠశాలల నుంచి 500 మందికి పైగా విద్యార్థులు ర్యాలీలో పాల్గొనగా నవీపేట్ జంక్షన్ వద్ద అధికారులు ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంవీఐ కిరణ్ కుమార్, ఏఎంవీఐలు పవన్ కళ్యాణ్, వాసుకి, శృతి, సీఐ శ్రీనివాస్ (CI Srinivas), ఎస్సై శ్రీకాంత్ (SI Srikanth), ఎంఈవో అశోక్, వర్ష ఈ-డీఏఆర్, రెండు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, శ్రీనివాస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
