అక్షరటుడే, బాన్సువాడ : Sub Collector Kiranmai | భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి (Sub Collector Kiranmai) అధికారులను ఆదేశించారు. మండలంలోని సంగోజిపేటలో (Sangojipet) ఇటీవల వర్షాలకు ధ్వంసమైన రోడ్లను మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా రోడ్ల మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు వేగంగా పూర్తిచేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్ వరప్రసాద్, ఎంపీడీవో ఆనంద్, పీఆర్ ఏఈ, మాజీ ఎంపీటీసీ జెట్టి హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.
Sub Collector Kiranmai | రోడ్లన్నీ ఛిద్రం..
భారీ వరదల కారణంగా బాన్సువాడ నియోజకవర్గంలో (Banswada Constituency) చాలా ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ముఖ్యంగా రహదారులన్నీ ఛిద్రమయ్యాయి. ఇప్పటికే వ్యవసాయాధికారుల నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నారు. త్వరలోనే నివేదికను అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించనున్నారు.