ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | రోడ్డుకు మరమ్మతులు.. ఎల్లారెడ్డి–బాన్సువాడ మధ్య బస్సులు ప్రారంభం

    Yellareddy | రోడ్డుకు మరమ్మతులు.. ఎల్లారెడ్డి–బాన్సువాడ మధ్య బస్సులు ప్రారంభం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు (heavy rains) చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యంగా ఎల్లారెడ్డి నుంచి ప్రధాన పట్టణాలను కలిపే పలు మార్గాల్లో రోడ్లు ధ్వంసం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి–బాన్సువాడ మార్గంలో (Yellareddy-Banswada route) సైతం రాకపోకలు నిలిచిపోయాయి.

    రోడ్డు ధ్వంసం కావడంతో ఆర్టీసీ బస్సులు నడవలేదు. దీంతో అధికారులు గత రెండు రోజులుగా రోడ్లకు మరమ్మతులు చేపడుతున్నారు. ఈ క్రమంలో శనివారం రోడ్డు అందుబాటులోకి రావడంతో ఎల్లారెడ్డి – బాన్సువాడ మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు (RTC bus services) పున:ప్రారంభం అయ్యాయి. ఎల్లారెడ్డి–బాన్సువాడ రోడ్డును బాన్సువాడ డిపో మేనేజర్ పరిశీలించారు.

    Yellareddy | ఆ మార్గాల్లో తిప్పలు

    ఎల్లారెడ్డి -కామారెడ్డి (Yellareddy-Kamareddy), ఎల్లారెడ్డి- మెదక్ (Yellareddy-Medak) మధ్య సైతం రోడ్డు వర్షాలకు తెగిపోయింది. దీంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పోచారం ప్రాజెక్ట్​కు భారీగా వరద వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్ట్​ దిగువన మెదక్ జిల్లా పోచమ్మరాల్, కామారెడ్డి జిల్లా పోచారం గ్రామాల మధ్య గల వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయింది. మధ్యలో బ్రిడ్జి మాత్రమే ఉంది. ఎల్లారెడ్డి మీదుగా మెదక్​, హైదరాబాద్​ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్లకు కూడా మరమ్మతులు చేపట్టి అందుబాటులోకి తీసుకు రావాలని ప్రజలు కోరుతున్నారు.

    ఎల్లారెడ్డి మెదక్ రోడ్డుపై కొట్టుకుపోయిన పోచారం వంతెన

    ధ్వంసమైన ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డు

    More like this

    Renjal Mandal | విద్యార్థులకు ఖురాన్ అందజేత

    అక్షరటుడే, బోధన్: Renjal Mandal | పట్టణంలోని రెంజల్ బేస్ లో గల నిజామియా పాఠశాలలో విద్యార్థులకు ఖురాన్...

    Crop Damage | నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆదుకుంటుంది

    అక్షరటుడే, డోంగ్లి: Crop Damage | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మండలంలో 3,200 ఎకరాల్లో పంట...

    Movements and Protests | రెండు దేశాలు.. రెండు ఉద్యమాలు.. ప్రభుత్వాలను కూల్చేసిన నిరసనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movements and Protests | రెండు దేశాల్లో రగిలిన రెండు ఉద్యమాలు అక్కడి ప్రభుత్వాలను...