ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCollector Kamareddy | రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్​

    Collector Kamareddy | రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలి: కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, లింగంపేట: Collector Kamareddy | అధిక వర్షాలతో కేకేవై రహదారిపై (KKY Road) తెగిపోయిన రోడ్ల పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు.

    లింగంపేట్ (Lingampet) మండలంలోని లింగంపేట్ కుర్దు వాగు వద్ద వంతెనను ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఆర్​అండ్​బీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కామారెడ్డి ఎల్లారెడ్డి రూట్​లో ప్రధాన రహదారిపై ఉన్న ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఈదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రవాణాను పునరుద్ధరించడానికి ఆర్​అండ్​బీ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆర్​అండ్​బీ ఈఈ మోహన్​ను ఆదేశించారు. ఎల్లారెడ్డి డివిజన్​లో దెబ్బతిన్న అన్ని రోడ్లు, వంతెనల పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆర్డీవో పార్థ సింహారెడ్డిని ఆదేశించారు.

    Collector Kamareddy | పోచారం ప్రాజెక్ట్​ పరిశీలన

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: పోచారం ప్రాజెక్టు (Pocharm Project) మట్టికట్ట కోతకు గురైంది. ప్రాజెక్టు పొంగిపోర్లుతూ మంజీరలోకి వెళ్లే దారిలో భారీ వంతెన వద్ద రోడ్డు తెగిపోగా.. హైదరాబాద్-ఎల్లారెడ్డి రహదారి మూసుకుపోయింది. ఈ నేపథ్యంలో శనివారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ పోచారం ప్రాజెక్టును సందర్శించి, జరుగుతున్న పనులను, తెగిపోయిన వంతెనను పరిశీలించారు.

    ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. ఎల్లారెడ్డి మెదక్–హైదరాబాద్​కు రాకపోకలకు ఎలాంటి అవంతరాలు జరగకుండా బ్రిడ్జి పనులను తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్​అండ్​బీ ఇరిగేషన్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

    More like this

    Kamareddy | ఊపిరితిత్తులలో ఇరుక్కున్న శనగ గింజ.. చికిత్స చేసి తొలగించిన వైద్యులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని శ్వాస చెస్ట్ అండ్ జనరల్ ఆస్పత్రిలో (Swasah Chest and General...

    Minister Nitin Gadkari | వరద సాయం అందించి కామారెడ్డిని ఆదుకోండి

    అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి....

    Nepal | నేపాల్‌ లో విధ్వంసం.. అధ్యక్షుడు, ప్రధాని ఇళ్లకు నిప్పు.. పలువురు మంత్రులపై దాడి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌ లో రెండోరోజూ విధ్వంసకాండ కొనసాగింది. యువత ఆందోళనలతో హిమాయల దేశం...