అక్షరటుడే, ఇందూరు : Sand Accumulation | నగరంలోని పెద్ద బజార్ (Pedda Bazaar) చౌరస్తాలో శుక్రవారం ఉదయం బైక్పై నుంచి పడి ఓ యువతి గాయాలపాలైంది. ఇటీవల పెద్ద బజార్లో ప్రభుత్వం కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టింది. అయితే రోడ్డుపైనే ఇసుక, కంకర వేసి పనులను నిర్వహించారు. మిగిలిన ఇసుకను తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
Sand Accumulation | రోడ్డుపై ఇసుక ఉండడంతో..
ఇటీవల రోడ్డుపై కల్వర్టు పనులు పూర్తయ్యాయి. అయితే అక్కడి నుంచి ఇసుకను పూర్తిగా తొలగించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. నడిరోడ్డుపై ఇసుక కారణంగా బైక్పై వెళ్లే అనేకమంది కిందపడి గాయాలపాలయ్యారని స్థానికులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఓ యువతి బైక్పై వెళ్తూ ఇసుక కారణంగా జారిపడింది. ఈ క్రమంలో ఆమె కాలికి గాయమైంది. అదృష్టవశాత్తూ వెనక నుంచి ఎలాంటి వాహనం రాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Sand Accumulation | స్థానికుల ఆగ్రహం..
రోడ్డుపై కల్వర్టు నిర్మాణం పూర్తయి రోజులు గడుస్తునప్పటికీ సంబంధిత శాఖ సిబ్బంది రోడ్డును శుభ్రపర్చలేదు. కల్వర్టు నిర్మించిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కూడా ఇందులో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. పనులు పూర్తయిన తర్వాత మిగిలిన మెటీరియల్ను తరలించాల్సిన బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్కు కూడా ఉంటుందని వారంటున్నారు. ఇక మున్సిపల్ సిబ్బంది (Municipal Staff) రోడ్డుపై ఇసుకను తొలగింపజేస్తే ప్రమాదాలకు ఆస్కారం ఉండదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.