అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి పట్టణంలోని (Kamareddy town) నిజాంసాగర్ చౌరస్తాలో ప్రధాన రహదారి మూలమలుపు ప్రమాదకరంగా మారింది. నిజాంసాగర్ నుంచి బస్టాండ్ వైపు వెళ్లే దారిలో హనీ బేకరీ ఎదుట మలుపు వద్ద రహదారి కుంగిపోయింది. చౌరస్తా వద్ద ట్రాఫిక్ కంట్రోల్ (traffic control) కోసం పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నిజాంసాగర్ నుంచి వచ్చే వాహనాలు ఒక్కొక్కటి మాత్రమే వెళ్లే పరిస్థితి ఏర్పడింది.
మూలమలుపు వద్దనే రోడ్డు కుంగిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం వర్షం పడడంతో కుంగిన రహదారిలో నీళ్లు చేరి రోడ్డు కనిపించడం లేదు. ప్రధాన రహదారి వద్ద రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారినా అధికారులు పట్టనట్టు వ్యవరించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుంగిన రహదారిని బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.

