అక్షరటుడే, కామారెడ్డి : Collector Kamareddy | రోడ్డు ప్రమాదాలు (Road Accidents) కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలో విద్యార్థులతో నిజాంసాగర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలసూచించారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకుని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని సూచించాలన్నారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది 20శాతం ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ఈ సంఖ్య ఇంకా తగ్గాలని పేర్కొన్నారు.
Collector Kamareddy | హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి..
ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ద్విచక వాహనదారుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్, ట్రాఫిక్ నియమాలను పాటిస్తేనే ప్రాణ రక్షణ సాధ్యమన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను సైతం రిస్క్‌లో పెట్టినవాళ్లమవుతామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం వాహనదారులు, విద్యార్ధులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.