అక్షరటుడే, కామారెడ్డి : Road Accident Prevention Measures | రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుశాఖ (Police Department) చర్యలు తీసుకుంటోంది. ప్రధాన మార్గాల్లో బ్లాక్ స్పాట్లు గుర్తించి ఎక్కడికక్కడ బారికేడ్లు, డ్రమ్ములు ఏర్పాటు చేస్తున్నారు. ఫలితంగా గతంలో కంటే ప్రమాదాలు తగ్గాయి.
Road Accident Prevention Measures | పాల్వంచ మండల కేంద్రంలో..
పాల్వంచ మండల (Palvancha Mandal) కేంద్రంతో పాటు భవానీపేట గ్రామాల మధ్యలో ఉన్న ఎన్హెచ్ 11 రహదారిపై రేడియంతో కూడిన 9 డ్రమ్ములను శనివారం ఏర్పాటు చేశారు. ప్రమాదాల నివారణతో పాటు వాహనాల వేగాన్ని తగ్గించేందుకు రూరల్ సీఐ రామన్ (Rural CI Raman) ఆధ్వర్యంలో మాచారెడ్డి పోలీసులు (Machareddy Police) ఏర్పాటు చేశారు. గతంలో కూడా ఇదే స్థలంలో రేడియంతో కూడిన 12 డ్రమ్ములను ఏర్పాటు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రూరల్ సీఐ రామన్, మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ సిబ్బంది, పాల్వంచ, భవానీపేట సర్పంచ్, ఉప సర్పంచులు పాల్గొన్నారు.
Road Accident Prevention Measures | ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికలు..
ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. రోడ్ సేఫ్టీ వీక్లో పాటు పలు కార్యక్రమాల ద్వారా యువతకు, రోడ్డుపై వెళ్లే వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే జరిగే ప్రమాదాలను వివరిస్తూ విద్యార్థులకు కళాశాలల్లో సైతం అవగాహన కల్పించారు. దీంతో జిల్లాలో గతంలో కంటే ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ వెల్లడించారు.