అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. తన ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దగ్గి వద్ద ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మంజూర్ హుస్సేన్(47) వృత్తిరీత్యా మార్కెటింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కాగా.. అతను శనివారం తెల్లవారు జామున బైకుపై 44వ నంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్నాడు. ఈ క్రమంలో దగ్గి సమీపంలో ప్రమాదవశాత్తు ముందువెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కామారెడ్డి జిల్లా కేంద్ర జనరల్ ఆస్పత్రికి తరలించారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.