అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని మూడవ టౌన్ పరిధిలోని అయ్యప్పగుడి (Ayyappa Gudi) వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మూడో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వే కమాన్ (Railway Comman) సమీపంలోని అయ్యప్ప గుడి వద్ద ఆర్టీసీ బస్సు బైక్‌పై వెళ్తున్న సంతోష్ అనే వ్యక్తిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి.
స్పందించిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అనంతరం అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లుగా తెలిసింది. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.