ePaper
More
    Homeఅంతర్జాతీయంLondon | లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి

    London | లండన్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు హైదరాబాద్ యువకుల మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : London | లండన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు (Hyderabad) చెందిన ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

    తెలుగు రాష్ట్రాలకు (Telugu states) చెందిన పలువురు యువకులు లండన్​లో వినాయకుడిని ప్రతిష్ఠించారు. సోమవారం నిమజ్జనం కోసం రెండు కార్లలో వెళ్లారు. తిరిగి వస్తుండగా వారి కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మృతులను నాదర్​గుల్​కు చెందిన తర్రె చైతన్య (23), ఉప్పల్‌కు (Uppal) చెందిన రిషితేజ(21)గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రి సమాచారం అందింది. ఈ ఘటనలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

    London | ఉన్నత చదువుల కోసం..

    నాదర్​గుల్​కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య బీటెక్​ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 8 నెలల క్రితం లండన్​ (London) వెళ్లాడు. తమ కొడుకు విదేశాల్లో చదువుకొని తిరిగి వస్తాడని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. కానీ రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వారి కుమారుడిని బలి తీసుకుంది.

    More like this

    Indiramma houses | వేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పెరిగిన ధరలతో లబ్ధిదారుల ఇబ్బందులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని...

    Gold Price | ఆల్ టైమ్ హైకి చేరుకున్న ప‌సిడి ధ‌ర‌.. ఇక సామాన్యుల‌కి క‌ష్ట‌కాల‌మే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Price | నగల ప్రియులకు, పెట్టుబడిదారులకు మరోసారి షాక్‌. బంగారం  ధరలు రోజు...

    Pawan Kalyan | నిన్ను చంప‌డానికి వ‌స్తున్నా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే గ్లింప్స్ అదుర్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన...