Homeక్రైంKarnataka Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసుల మృతి

Karnataka Accident | కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. నలుగురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటకలోని బీదర్​లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు మృతి చెందారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka Accident | కర్ణాటక రాష్ట్రం (Karnataka State)లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ (Telangana)కు చెందిన నలుగురు మృతి చెందారు.

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నారాయణఖేడ్ తాలూకాలోని జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందిన పలువురు కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి కారులో వెళ్లారు. దర్శనం అనంతరం బుధవారం ఉదయం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చసుకుంది. బీదర్‌ జిల్లా (Bidar District)లోని హల్లిఖేడ్‌లో వీరి కారును ఎదురుగా వస్తున్న డీటీడీసీ వాహనం ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతుల్లో జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన నవీన్ (40), రాచప్ప (45), నాగరాజ్​ (40), కాశీనాథ్ (60) ఉన్నారు. ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని బీదర్ బ్రిమ్స్ ఆసుపత్రి (Bidar Brims Hospital)లో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు.

Karnataka Accident | నుజ్జునుజ్జయిన కారు

కారు, వ్యాన్​ ఎదురెదురుగా ఢీకొనడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. వీరు తెలంగాణ నుంచి కలబురగి జిల్లాలోని గానుగాపూర్‌ దత్తాత్రేయుడిని (Ganugapur Dattatreya) పూజించడానికి వెళ్లారు. హుమానాబాద్ మీదుగా ఆలయం నుంచి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ధన్నూర్ పోలీస్ స్టేషన్ (Dhannur Police Station) పరిధిలో ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. జేసీబీ సాయంతో కారులోని మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం కారును పక్కకు తొలగించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడంతో జగన్నాథ్‌పూర్ గ్రామం (Jagannathpur Village)లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆలయానికి వెళ్లిన వారు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.