అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | హైదరాబాద్ నగరంలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ (Medipally Police Station) పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు అతివేగంగా మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.
మౌలాలి (Moulali)లోని ఓ స్నేహితుడి ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు 8 మంది విద్యార్థులు వెళ్లారు. అనంతరం నిఖిల్ (22) మిగతా మిత్రులను పోచారంలో దింపడానికి వెళ్తుండగా.. ప్రమాదం (Road Accident) జరిగింది. మేడిపల్లిలోని ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ఫ్లైఓవర్ పిల్లర్ నెంబర్ 97 వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. దీంతో కారు పిల్లర్‌ను బలంగా ఢీకొంది.దీంతో పిల్లర్ నెంబర్ 97 ను బలంగా ఢీకొట్టింది.
Hyderabad | తీవ్ర గాయాలు
కారు అతివేగంగా ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు కాగా.. ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని వనపర్తి జిల్లా (Wanaparthy District)కు చెందిన సాయి వరుణ్, నిఖిల్‌గా గుర్తించారు. వెంకట్, రాకేష్, యశ్వంత్ అనే ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ అనే ముగ్గురు విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad | మేడారం జాతరకు వెళ్తూ..
మేడారం జాతర (Medaram Jathara)కు వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు భక్తులు మృతి చెందారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కేశవపూర్ శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ జిల్లా మహదేవ్పూర్ మండలం బొమ్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్లో 25 మంది భక్తులు మేడారం జాతరకు బయలు దేరారు. అయితే ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.