అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America Accident | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ (Telangana)కు చెందిన ఇద్దరు యువతులు చనిపోయారు.
కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో మహబూబాబాద్ జిల్లా గార్ల గ్రామం మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి చెందారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు.
America Accident | ఉద్యోగ అన్వేషణలో ..
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad District) గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ ఎంఎస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితులతో కలిసి టూర్‌కు వెళ్లి వస్తుండగా. . వీరి కారు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. యూఎస్‌లో చదివి కొలువులు చేస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి తల్లిదండ్రులు మరణవార్త విని షాక్ అయ్యారు. ఈ ఘటనతో గార్ల మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.