అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: constable murder case | కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఆస్పత్రి ఎదుట పటాకులు కాల్చారు. దీపావళి రోజు నరకాసుర వధ జరిగిందంటూ చర్చించుకుంటున్నారు. ఎన్కౌంటర్ చేసిన పోలీసులపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. పోలీసులపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘హాట్సాఫ్ పోలీస్’ అంటూ పొగుడుతున్నారు. ‘పోలీసులకు ఇది నిజమైన దీపావళి’ అంటూ పోస్టులు చేస్తున్నారు. డీజీపీ శివధర్ రెడ్డి, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సీపీ సాయిచైతన్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘శివ భక్తుడికి కోపం వస్తే.. అసలైన శివ తాండవమే’ అంటూ సీపీ సాయిచైతన్యను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
constable murder case | రియాజ్ ఎన్కౌంటర్.. పోలీసులపై ప్రశంసల జల్లు
కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారు.