అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: constable murder case | కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు, రౌడీ షీటర్ రియాజ్ ఎన్‌కౌంటర్‌పై ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిందితుడు రియాజ్ ఆస్పత్రి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్ లాక్కుని దాడికి యత్నించాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్ లాక్కుని దాడికి యత్నించాడు. కాగా.. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు రియాజ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ హతమయ్యాడు. దీంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి ఎదుట పటాకులు కాల్చారు. దీపావళి రోజు నిజమైన నరకాసుర వధ జరిగిందంటూ వ్యాఖ్యానించారు.