Homeతాజావార్తలుRiyaz encounter | రౌడీషీటర్​ రియాజ్​ ఎన్​కౌంటర్​.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ

Riyaz encounter | రౌడీషీటర్​ రియాజ్​ ఎన్​కౌంటర్​.. కీలక విషయాలు వెల్లడించిన సీపీ

రౌడీ షీటర్​ రియాజ్ ఎన్​కౌంటర్​ ఘటనపై నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య స్పందించారు. ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: Riyaz encounter |  నిజామాబాద్​ సీసీఎస్​ కానిస్టేబుల్​ ప్రమోద్​ను హతమార్చిన కేసులో రౌడీ షీటర్​ రియాజ్​ను పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం తెలిసిందే. అయితే ఘటనపై నిజామాబాద్​ సీపీ సాయిచైతన్య కీలక విషయాలు వెల్లడించారు.

ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం రెగ్యులర్​ చెకప్​లో భాగంగా విధుల్లో ఉన్న ఆర్​ఐ వార్డు వద్దకు వెళ్లగా.. తలుపు, అద్దం పగులగొడుతున్న శబ్దం వినిపించింది. దీంతో వెంటనే సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. ఆర్​ఐతో పాటు ఎస్సై, కానిస్టేబుల్ వార్డులోకి వెళ్లారు. రియాజ్​ హంగామా సృష్టిస్తుండడంతో అతడిని బెడ్​ వద్దకు తీసుకెళ్లే క్రమంలో నిందితుడు కానిస్టేబుల్​ వద్దనున్న తుపాకీని లాక్కుని ట్రిగ్గర్​ నొక్కే ప్రయత్నం చేశాడు. ఆర్​ఐ వారిస్తున్నా వినిపించుకోకుండా ట్రిగ్గర్​ నొక్కాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్​ఐ రియాజ్​పై కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు కుప్పకూలిపోయాడని సీపీ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. నిబంధనల ప్రకారం ఫార్మాలిటీస్​ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

కాగా.. రియాజ్​ చేసిన దాడిలో ఆసిఫ్​ అనే వ్యక్తికి గాయాలైన విషయం తెలిసిందే. బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్​కు తరలించినట్లు సీపీ తెలిపారు.