Homeక్రైంRiyaz encounter case | నా కొడుకు మెడ విరగ్గొట్టారు.. కడుపులో పేగులు బయటకు తీశారు.....

Riyaz encounter case | నా కొడుకు మెడ విరగ్గొట్టారు.. కడుపులో పేగులు బయటకు తీశారు.. రియాజ్‌ తల్లి భావోద్వేగం..!

Riyaz encounter case | తన కుమారుడితో పాటు, తమ కుటుంబంపై పోలీసులు అమానుష దాడికి పాల్పడ్డారని, ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని కమిషన్​కు రియాజ్​ తల్లి భావోద్వేగంతో విన్నవించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Riyaz encounter case | తెలంగాణ Telangana లోని నిజామాబాద్​ Nizamabad లో కానిస్టేబుల్​ ప్రమోద్​ constable Pramod ను కత్తితో పొడిచి, హతమార్చినట్లు ఆరోపణలు ఎదుర్కొని పోలీసుల చేతిలో ఎన్​కౌంటర్​ చేయబడ్డ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా పోలీసులపై రియాజ్​ తల్లి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. షేక్‌ రియాజ్‌ ఎన్‌కౌంటర్‌ బూటకమని ఆమె ఆరోపిస్తున్నారు.

Riyaz encounter case | మహిళా కమిషన్​కు ఫిర్యాదు..

ఈమేరకు ఆమె జాతీయ మహిళా కమిషన్​ (National Women’s Commission) ను ఆశ్రయించారు. కుమారుడితో పాటు, తమ కుటుంబంపై పోలీసులు అమానుష దాడికి పాల్పడ్డారని, ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని కమిషన్​కు ఆమె  భావోద్వేగంతో విన్నవించారు.

రియాజ్‌ను పోలీసులు దారుణంగా చంపేశారని ఆ తల్లి ఆరోపించారు. రియాజ్​ మెడ విరిచేశారని, పొట్టలో నుంచి పేగులు బయటకొచ్చాయని ఆవేదనతో చెప్పుకొచ్చారు.

అసలు కానిస్టేబుల్‌ ప్రమోద్‌ను హత్య చేసింది తన కొడుకు రియాజ్‌ కాకపోవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రమోద్‌ హత్యోదంతంపై లోతుగా విచారణ జరపాలని విన్నవించారు. తన కొడుకే హంతకుడు అయితే ఆధారాలు చూపించాలని ఆమె కోరారు.

Must Read
Related News