ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Green field Airport | అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు తెరలేపిన రైట్స్ సంస్థ.. త్వరలో నివేదిక

    Green field Airport | అమరావతిలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు తెరలేపిన రైట్స్ సంస్థ.. త్వరలో నివేదిక

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Green field Airport | అమరావతిలో అంతర్జాతీయ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ (international-level Greenfield Airport) నిర్మాణానికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థ రైట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించి సర్వేలు కొనసాగిస్తూ, త్వరలో ప్రాథమిక నివేదికను సమర్పించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమరావతి (Amaravati) సమీప ప్రాంతాల్లో గల అనువైన భూములపై సర్వేలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 4,000 నుంచి 5,000 ఎకరాల భూమిని ఎయిర్‌పోర్ట్‌ (Airport) కోసం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

    Greenfield Airport | శరవేగంగా పనులు..

    ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ (Green Field Airport) ద్వారా అంతర్జాతీయ ఎయిర్ కనెక్టివిటీ పెరగనుంది.విదేశీ పెట్టుబడులకు అవకాశాలు సృష్టించబోతున్నాయి. అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంత అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలవనుంది. విమానాశ్రయం నిర్మాణ పనులు (Airport construction work) ఇంకా రెండేళ్లలో ప్రారంభం కావొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. భూసేకరణ, నివేదికలు, అనుమతుల ప్రక్రియ పూర్తయిన వెంటనే నిర్మాణానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్ట్ అమలుతో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) మరింత గౌరవం, వాణిజ్య అభివృద్ధి చేకూరే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

    ఈ మేరకు దీనికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిశీలిస్తోంది. కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర నివేదికను 32 వారాల్లో అందజేయాలని APADCL గడువు విధించింది . విమానాశ్రయం కోసం ప్రతిపాదనలు చేసిన స్థలాన్ని సర్వే చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ఫైనాన్షియల్ మోడల్‌పై నివేదిక, పర్యావరణ, సోషల్ ఇంపాక్ట్ సర్వే (social impact survey) చేస్తారు. టెక్నో ఎకనమిక్ ఫీజిబిలిటీ స్టడీ నిర్వహించి.. భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. విమానాశ్రయం కోసం ప్రతిపాదనలు చేసిన స్థలాన్ని సర్వే చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. విమానాశ్రయాలున్న ప్రాంతాలను ఏవియేషన్ హబ్‌లుగా (aviation hubs) అభివృద్ధి చేయడానికి వైమానిక, రక్షణ రంగ తయారీ పరిశ్రమల అవకాశాలపై కన్సల్టెన్సీ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని ఏపీఏడీసీ పేర్కొంది.

    More like this

    Global market Analysis | లాభాల్లో గ్లోబల్‌ మార్కెట్లు.. పాజిటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్‌ నిఫ్టీ

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Global market Analysis : యూఎస్‌, యూరోప్‌ మార్కెట్లు(Europe markets) సోమవారం లాభాలతో ముగిశాయి. మంగళవారం...

    Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి...

    NH 44 | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఒకరి దుర్మరణం

    అక్షరటుడే, ఇందల్వాయి: NH 44 | జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాలుగైదు రోజుల క్రితం...