ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    Uttar Pradesh | మ‌హిళ‌తో కలిసి బైక్​పై రిస్కీ స్టంట్స్.. వీడియో వైరల్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఇటీవ‌లి కాలంలో రోజురోజుకూ బరితెగించేస్తున్నారు. సమాజమే సిగ్గుతో తలదించుకునేలా వారు చేస్తున్న ప‌నులు అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నాయి. నలుగురిలో ఉన్నామనే కనీస స్పృహ లేకుండా దారుణంగా ప్ర‌వ‌ర్తించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది. చుట్టు ప‌క్క‌ల వారు వీడియోలు (videos) తీస్తున్నారని కూడా లేకుండా తమ లోకంలో మునిగిపోతున్నారు. ఇక లవర్స్ అయితే ఎక్కడపడితే అక్కడే హగ్‌లు, ముద్దులతో (hugs and kisses) రెచ్చిపోతున్నారు. తాజాగా యువతీయువకుల జంట.. బైక్‌పై ప్రయాణిస్తూనే ప్రమాదకరమైన విన్యాసం చేయడం చ‌ర్చ‌నీయాంశం అయింది.

    Uttar Pradesh | రిస్కీ జ‌ర్నీ..

    వారి పక్కనే వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) పెట్టడంతో వైరల్‌గా మారింది. సీసీటీవీ ఫుటేజీ (CCTV footage) ఆధారంగా వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాత్రి 10 గంటల సమయంలో ఆగ్రా-కాన్పూర్ నేషనల్ హైవేపై (Agra-Kanpur National Highway) ఓ యువజంట చేసిన సాహసోపేత ప్రేమ ప్రయాణం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఒక యువకుడు బైక్ (Bike) నడుపుతుండగా, యువతి బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్‌పై పడుకొని అబ్బాయిని కౌగిలించుకొని పడుకున్నట్టు కనిపించింది. హైవేపై పలు వాహనాలు పరుగులు పెడుతున్నా, ప్రమాదాన్ని లెక్కచేయకుండా ఈ జంట అత్యంత ప్రమాదకరంగా బైక్‌పై ప్రయాణం (dangerous bike ride) చేసింది.

    ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ (Social Media Post) చేయగా, అది కాస్తా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, “ఇది ప్రేమ కాదు.. ప్రాణాలతో ఆటలాడడం”, “ఇవ్వాళ నిన్ను బైక్‌పై ప్రేమగా హగ్ చేస్తుంది.. రేపు ఫిర్యాదు చేస్తుంది” అంటూ వినోదాత్మక వ్యాఖ్యలతో పాటు తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్​గా మారడంతో ఫిరోజాబాద్ పోలీసులు (Firozabad police) కూడా స్పందించారు. వీడియోను పరిశీలిస్తున్నామని, అందులో కనిపించిన బైక్ నెంబర్ (Bike number) ఆధారంగా యువజంటను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా ప్రవర్తించి వారు ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడమే కాకుండా, స్వయంగా తమ ప్రాణాలకే ప్రమాదం కలిగించారని పేర్కొన్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...