అక్షరటుడే, హైదరాబాద్: Rising gold prices : ఇటీవలి కాలంలో బంగారం ధరలలో Gold Prices మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటుండటం మనం చూస్తూనే ఉన్నాం.
ఒకసారి కాస్త తగ్గిన బంగారం Gold ధర తర్వాత అమాంతం పైపైకి పోతోంది. బంగారం ధరలు ఇలా పెరుగుతూ సామాన్యుల గుండెల్లో గుబులు రేపుతోంది.
పండుగల సీజన్‌లో బంగారం ధరలు ఇలా పెరుగుకుంటూ పోతుండటం మహిళలకి పెద్ద షాకింగ్‌గా మారింది. భారతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి కొత్త రికార్డులను నమోదు చేశాయి.
Rising gold prices : భగ్గుమంటున్న బంగారం
భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, రూపాయి క్షీణత కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి సారించడంతో పసిడి డిమాండ్ గణనీయంగా పెరిగింది.
ఈ ప్రభావంతో శనివారం (సెప్టెంబరు 20) నాటికి 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,11,340 కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,02,060 గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల పసిడి ధర రూ. 1,11,490 కి, 22 క్యారెట్ల ధర రూ. 1,02,210 కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడ, ముంబయి Mumbai , కోల్‌కతా Kolkata, చెన్నై Chennai, బెంగళూరు, కేరళ, పుణె వంటి నగరాల్లో 24 క్యారెట్ల ధర రూ. 1,11,340 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,060 గా ఉంది.
వడోదరలో మాత్రం 24 క్యారెట్ల ధర రూ. 1,11,390 , 22 క్యారెట్ల ధర రూ. 1,02,110 గా నమోదైంది. వెండి ధరలు కూడా నిన్నటితో పోల్చితే కేజీకి వంద రూపాయల మేర పెరిగాయి.
హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కేరళలో వెండి ధర కేజీకి రూ. 1,43,100గా ఉండగా.. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్‌లో వెండి ధర Silver prices రూ. 1,33,100 గా నమోదైంది.
మొత్తంగా బంగారం, వెండి ధరల పెరుగుదల పండుగ సీజన్‌లో వినియోగదారులకు భారమవుతుండగా.. పెట్టుబడిదారులకు మాత్రం లాభదాయకంగా మారుతోంది.