Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar project | నిజాంసాగర్​కు పెరుగుతోన్న వరద.. తొమ్మిది గేట్ల ఎత్తివేత

Nizamsagar project | నిజాంసాగర్​కు పెరుగుతోన్న వరద.. తొమ్మిది గేట్ల ఎత్తివేత

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar project | నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. 56,992 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టుకు సంబంధించి తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద (heavy flood) వస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తంగా 62,542 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

Nizamsagar project | సింగూరు ప్రాజెక్టుకు సైతం..

సింగూరు ప్రాజెక్టుకు (Singur project) సైతం ఎగువ నుంచి భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టులోకి 35వేల క్యూసెక్కుల వరద ఎగువ నుంచి వస్తుండడంతో ప్రాజెక్టు అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు రాత్రి 9 గంటలకు ప్రాజెక్టు గేట్లను (project gates) ఎత్తి దిగువకు నీటిని వదులుతామని సింగూరు ప్రాజెక్టు అధికారులు స​మాచారమిచ్చారు. ముఖ్యంగా పశువుల కాపర్లు నది పరీవాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దని సూచించారు. జాలర్లు నదిలోకి వెళ్లవద్దని సింగూరు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ భీమ్​ పేర్కొన్నారు.

Must Read
Related News