Homeజిల్లాలునిజామాబాద్​SRSP | శ్రీరామ్​సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 8 గేట్లు ఎత్తివేత

SRSP | శ్రీరామ్​సాగర్ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద.. 8 గేట్లు ఎత్తివేత

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు నుంచి ఎగువ నుంచి భారీగా వరద వస్తుండడంతో అధికారులు స్పందించారు. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : SRSP | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరాం సాగర్​ ప్రాజెక్ట్​కు (Sriram Sagar Project) ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు జలాశయంలో క్రమక్రమంతో వరద పెరుగుతోంది. దీంతో అధికారులు మంగళవారం ఉదయం 8 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నారు.

SRSP | ప్రాజెక్టులోకి..

ప్రాజెక్ట్​లోకి ప్రస్తుతం 34,654 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు అంతే మొత్తంలో క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. కాకతీయ కాలువకు (Kakatiya Canal) 3 వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 5వేలు, సరస్వతి కాలువకు 650, లక్ష్మి కాలువకు200 క్యూసెక్కులు వదులుతున్నారు. మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1091.00 అడుగుల  (80.501 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది.

SRSP | దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

గోదావరి (Godavari) పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, జాలర్లు, రైతులు, ప్రయాణికులు గోదావరిని దాటే ప్రయత్నాలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎఫ్ఎఫ్​సీ అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

Must Read
Related News