Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar Project | నిజాంసాగర్​కు పోటెత్తుతున్న వరద..​ 19 గేట్ల ఎత్తివేత

Nizamsagar Project | నిజాంసాగర్​కు పోటెత్తుతున్న వరద..​ 19 గేట్ల ఎత్తివేత

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Project | జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజాంసాగర్​కు వరద పోటెత్తుతోంది. అలాగే ఎగువన సింగూరు, పోచారం ప్రాజెక్ట్​ల (Pocharam projects) నుంచి భారీగా వరద వస్తోంది. దీంతో అధికారులు 19 గేట్ల ద్వారా 1,39,336  క్యూసెక్కుల నీటిని మంజీరలోకి వదులుతున్నారు.

Nizamsagar Project | కొనసాగుతున్న వరద..

నిజాంసాగర్​ ప్రాజెక్ట్​కు వరద కొనసాగుతోంది. జలాశయంలోకి ఎగువ నుంచి 1,30,097 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 1405 అడుగులు (17.802 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1401.61 అడుగుల (13.123 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఆయకట్టు కోసం ప్రధాన కాలువకు 900 క్యూసెక్కులు వదులుతున్నారు.

Nizamsagar Project | సింగూరు నుంచి..

నిజాంసాగర్​ ప్రాజెక్టుకు ఎగువన గల సింగూరు ప్రాజెక్టుకు (Singuru) వరద కొనసాగుతుండడంతో గేట్లను ఎత్తి 96,604 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 90,000 ఇన్​ఫ్లో వస్తుండడంతో దిగువకు వదులుతున్నారు.

Must Read
Related News