అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rishabh Pant | మాంచెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు (Rishabh Pant) గాయమైన విషయం విదితమే.తొలి రోజు ఆటలో రివర్స్ షాట్ ఆడే క్రమంలో అతని కుడి పాదానికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే పంత్‌కు గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, జట్టు అవసరాల మేరకు అతను బ్యాటింగ్‌కు దిగాడు. పంత్ కుడి పాదం వేలికి గాయమై, ఫ్రాక్చర్ అయిందని వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో, ఈ టెస్ట్‌తో పాటు మిగిలిన సిరీస్ మొత్తానికీ అతను దూరం కానున్నాడని, డాక్టర్లు కనీసం ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించారన్న కథనాలు నేషనల్ మీడియాలో ప్రచురితమయ్యాయి.
Rishabh Pant | వారియర్..
అయితే ఈ వార్తలపై బీసీసీఐ (BCCI) వెంటనే స్పందించింది. వికెట్ కీపింగ్‌కు పంత్ దూరంగా ఉండనున్నప్పటికీ, జట్టు అవసరాల నేపథ్యంలో అతను బ్యాటింగ్ చేస్తాడని స్పష్టం చేసింది. మాంచెస్టర్ టెస్ట్ మొదటి రోజు గాయపడిన రిషభ్ పంత్, రెండో రోజు బ్యాటింగ్ చేస్తాడు. అతని స్థానంలో ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారు అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే, ఆరో వికెట్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) ఔట్ కావడంతో రిషభ్ పంత్ క్రీజులోకి దిగాడు. పంత్ తన గాయాన్ని లెక్కచేయకుండా బ్యాటింగ్‌కు రావడం మామూలు విషయం కాదు. తీవ్రమైన నొప్పితో కుంటుకుంటూ వచ్చిన అతను, వాషింగ్టన్ సుందర్‌తో జాగ్రత్తగా భాగస్వామ్యం కొనసాగించాడు. నిలబడటానికే ఇబ్బంది పడుతున్నా, కూడా జట్టు కోసం ఆడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు
స్టేడియంలో ఉన్న అభిమానులతో పాటు, ఇంగ్లండ్ ఆటగాళ్లు (England players) కూడా నిలబడి పంత్‌కి చప్పట్లతో స్వాగతించారు. పంత్ ఫైటర్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక 264/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌కు తొలి సెషన్ ఆరంభంలోనే షాక్ తగిలింది. రవీంద్ర జడేజా (20) ఒక్క పరుగు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ (41) వాషింగ్టన్ సుందర్‌తో కలిసి బాగా ఆడాడు. కానీ ఆ జోడీను స్టోక్స్ Stokes విడదీశాడు. ఆ తర్వాతే పంత్ క్రీజులోకి రావాల్సి వచ్చింది. పంత్, వాషింగ్టన్ జాగ్రత్తగా ఆడి లంచ్‌కు సరైన స్థితిలో భారత్‌ను చేర్చారు. లంచ్ సమయానికి భారత్ స్కోర్: 321/6 కాగా,ఆ తర్వాత సుందర్ (27), కాంబోజ్ (0) ఔట్ అయ్యారు. పంత్ (42 నాటౌట్) క్రీజులో ఉండగా, ఆయనతో పాటు సిరాజ్ (0) ఆడుతున్నారు. భారత్ ప్రస్తుతం 8 వికెట్లు కోల్పోయి 344 పరుగులు చేసింది.